గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దొరైస్వామి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు హెచ్ఎస్ దొరైస్వామి బుధవారం కన్నుమూశారు. 103 ఏళ్ల దొరైస్వామి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని జయదేవ ఊపరితిత్తుల వ్యాధుల ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మే 8న కరోనా సోకగా ఇదే ఆస్పత్రిలో చేరారు. మే 13న కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే, మరుసటి రోజు అస్వస్థతగా ఉందని తెలపడంతో ఆయనను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. కాగా, దొరైస్వామి అస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

దొరైస్వామి భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 14 నెలలు జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీ కాలంలోనూ ఆందోళన చేస్తానని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాయవడంతో ఆయనను 4 నెలలు జైలులో ఉంచారు.
అంతేగాక, గనుల మాఫియా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా దొరైస్వామి పోరాటం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించే వరకు కూడా ఆయన ప్రజా ఉద్యమాల్లోనే కొనసాగడం గమనార్హం. దొరైస్వామి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంతాపం ప్రకటించారు. పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications