‘మాకు హితబోధ చేసే ముందు నల్లజాతివారిపై దాడులు ఆపండి’
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల భారత్‌పై వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మత సహనంపై భారత్‌కు హితబోధలు చేసే ముందు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నల్లజాతివారిపై ఇప్పటికీ దాడులు జరుగుతున్న తమ దేశం గురించి ఆలోచిస్తే మంచిదంటూ విశ్వ హిందూ పరిషత్ ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
మిషనరీల కార్యకలాపాలకు తోడ్పడేందుకు చర్చి చొప్పించిన కొంతమందిని కలిసిన తర్వాత ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారని విహెచ్‌పి సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ శుక్రవారం అన్నారు. రాజకీయాల్లోకి చర్చి చొప్పించిన వారుగా అనుమానాలున్న అలాంటి వారి పేర్లను ప్రభుత్వం బైటపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

భారత్‌కు హితబోధలు చేసే ముందు ఒబామా అమెరికాలోని తన సొంతవారి గురించి ఆలోచించాలని, ఒక వేళ ఆయన హితబోధ చేయాలనుకుంటూ ఉంటే అమెరికా సాయంతో మత మార్పిడులు జరపడమే కాకుండా జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీలకు హితబోధ చేయాలని జైన్ చెప్పారు.
‘ఒబామా స్వయంగా నల్లజాతి వారు. అయినప్పటికీ నల్లజాతి వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపలేక పోతున్నారు' అని జైన్ ఆరోపించారు. భారత దేశంలో ఇటీవలి సంవత్సరాల్లో వివిధ మతాల వారిపై చోటు చేసుకుంటున్న ‘అసహన చర్యల'పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications