BCCI: టీవీ, డిజిటల్ ప్రసార హక్కులతో వేల కోట్లు ఆర్జిస్తున్న బీసీసీఐ.. వచ్చే ఐదేళ్లు వయాకామ్ 18కు హక్కులు..
క్రికెట్ ప్రసార హక్కులతో బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా 2023 నుంచి 2028 వరకు జరిగే భారత క్రికెట్ మ్యాచ్ లకు ప్రసారాలు వయాకామ్ 18 దక్కించుకుంది. గరువారం బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా జరిపిన ఈ వేలంలో టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకుంది. 88 మ్యాచ్‌ల కోసం భారత బోర్డుకు వయాకామ్ 18 రూ.5963 కోట్లు చెల్లించనుంది. అంటే ఒక్కో మ్యాచ్ కు దాదాపు రూ.67.8 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో డిస్నీ స్టార్ చెల్లించిన రూ.60.18 కోట్ల కంటే దాదాపు 13 శాతం ఎక్కువ.
టివీ ప్రసారాలకు ఒక్కో మ్యాచ్ కు రూ.32.5 కోట్లు కాగా డిజిటల్ ప్రసారాలకు ఒక్కో మ్యాచ్ కు రూ.35.3 కోట్లు చెల్లించనున్నారు. టివీ, డిజిటల్ కలిపి ఒక్కో మ్యాచ్ విలువ రూ.67.8 కోట్లు కానుంది. ప్రసార హక్కుల కోసం వయాకామ్ తో స్టార్ ఇండియా, సోనీ పోటీ పడ్డాయి. కానీ చివరికి వయాకామ్ 18 డిజిటల్, టీవీ ప్రసార హక్కులు సొంత చేసుకుంది. వయాకామ్ 18 డిజిటల్ ప్రసారాలకు రూ.3101 కోట్లు, టీవీ ప్రసార హక్కులకు రూ.2862 కోట్లు చెల్లించనుంది. వయాకామ్ ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను సొంత చేసుకుంది. దీని కోసం 26,000 కోట్లు చెల్లిస్తోంది.

ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు, ఐసీసీ టోర్నీ తప్ప మిగతా భారత్ ఆడే అన్ని ప్రధాన క్రికెట్ మ్యాచ్ ల ప్రసార హక్కులను వయాకామ్ 18 సొంతం చేసుకున్నట్లయింది.
ఈ నెల 22న భారత్ లో జరిగే ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో వయాకామ్ ఒప్పందం అమల్లోకి వస్తుంది. 2028 మార్చి 31న ఈ ఒప్పందం ముగియనుంది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. "వచ్చే 5 సంవత్సరాలకు లీనియర్, డిజిటల్ రెండింటికీ @BCCI మీడియా హక్కులను గెలుచుకున్నందుకు Viacom18కి అభినందనలు. @IPL, wplt20 తర్వాత మేము రెండు రంగాల్లోనూ భారత క్రికెట్ వృద్ధిని కొనసాగిస్తుంది. భాగస్వామ్యం @BCCI మీడియా హక్కులు కూడా. మేము కలిసి క్రికెట్ అభిమానుల ఊహలను పట్టుకోవడం కొనసాగిస్తాము" అని ట్వీట్ చేశారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) టీవీ, డిజిటల్ ప్రసారాలను కూడా వయాకామ్ చేతిలోనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్ డిజిటల్, టీవీ ప్రసార హక్కులు స్టార్ ఇండియా చేతిలో ఉన్నాయి. శనివారం జరిగే ఇండియా పాక్ మ్యాచ్ కు భారీగా వ్యూయిర్ షిప్ వస్తుందని అంచనా వేస్తున్నారు. గత టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ డిజిటల్, టీవీల్లో అనూహ్య స్పందన వచ్చింది. అయితే వయోకామ్ చేతిలో ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి ప్రసార హక్కులు లేకపోవడం ఆ సంస్థకు ఇబ్బంది కరమైన అంశమే.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications