Friends: మందు పార్టీ, అమ్మాయి విషయంలో ?, ఫ్రెండ్ ను చంపి వీడియోలు వాట్సాప్ లో షేర్ !
చెన్నై/ వేలూరు: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకులు ప్రతిరోజు కలుసుకుంటున్నారు. స్నేహితుల్లో కొందరు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ ఖాళీగా ఉన్న సమయంలో రాత్రి పూట కలిసి మద్యం సేవిస్తున్నారు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లిన యువకుడు తాను ఫ్రెండ్స్ ను కలిసి వస్తానని చెప్పి అతని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అంతే ఆ యువకుడు అడ్రస్ లేకుండా పోయాడు. తరువాత కనపడకుండా పోయిన యువకుడిని హత్య చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అప్పుడు అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

ఉద్యోగం చేస్తున్న యువకుడు
తమిళనాడులోని వేలూరు (చిత్తూరు జిల్లా బార్డర్) జిల్లాలోని కాట్పాడిలోని భారతీయర్ నగర్ లో శ్రీనివాసన్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శ్రీనివాసన్ టైర్ల వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాసన్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాసన్ పెద్ద కుమారుడు వెంకటేశన్ (21) డిప్లొమో పూర్తి చేసి వేలూరులో ఉద్యోగం చేస్తున్నాడు.

అమ్మకు మ్యాటర్ చెప్పి వెళ్లిన కొడుకు
కాట్పాడిలో నివాసం ఉంటున్న యువకులు ప్రతిరోజు కలుసుకుంటున్నారు. అందుకే వెంకటేశన్ కూడా ఉన్నాడు. స్నేహితులు ఖాళీగా ఉన్న సమయంలో రాత్రి పూట ఊరియబట కలుసుకుని మద్యం సేవిస్తున్నారు. గత శుక్రవారం రాత్రి ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లిన వెంకటేశన్ తాను ఫ్రెండ్స్ ను కలిసి వస్తానని చెప్పి అతని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

మిస్సింగ్ కేసు పెట్టిన తండ్రి
ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటేశన్ కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. కొడుకు ఎక్కడా కనపడకపోవడంతో వెంకటేశన్ కనపడటం లేదని అతని తండ్రి శ్రీనివాసన్ మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యులు వారం రోజుల నుంచి వెంకటేశన్ కోసం గాలిస్తున్నారు.

హత్య కేసు వీడియో వైరల్
వెంకటేశన్ ను అతని స్నేహితులు నలుగురు హత్య చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు కాట్పాడిలో వైరల్ అయ్యాయి. వెంకటేశన్ స్నేహితుడు ఒకరు ఆ వీడియో చూసి శ్రీనివాసన్ కు సమాచారం ఇచ్చాడు. కొడుకును అతని స్నేహితులు హత్య చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయిన శ్రీనివాసన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అమ్మాయి విషయంలో హత్య ?
శుక్రవారం రాత్రి వెంకటేష్ తో పాటు ఆరు మంది స్నేహితులు కాట్పాడి ఊరిబయట ఉన్న పాడుపడిన ఇంటిలో మద్యం సేవించారని, ఆ సందర్బంలో స్నేహితుల మద్య గొడవ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆసమయంలో సహనం కోల్పోయిన నలుగురు యువకులు వెంకటేషన్ ను హత్య చేసి ఫోటోలు, వీడియోలు తీశారని, తరువాత అదే పాడుపడిన ఇంటిలో వెంకటేశన్ శవం పూడ్చి పెట్టారని వెలుగు చూసింది. ఓ అమ్మాయి విషయంలో వెంకటేశన్ హత్యకు గురైనాడని పోలీసులు అంటున్నారు. ఆరోజు రాత్రి ఎవరెవరు మందు పార్టీకి వెళ్లారు, అక్కడ స్నేహితులు ఎంతసేపు ఉన్నారు, వెంకటేశన్ హత్యతో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్రెండ్ ను చంపేసి వారం రోజులు అతని స్నేహితులు హ్యాపీగా తిరగడం వేలూరులో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications