Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video:రెండేళ్ల తర్వాత బయటపడ్డ చాపర్ శిథిలాలు.. మోసుకెళ్లిన ఐఏఎఫ్ చినూక్ హెలికాఫ్టర్

కేదార్‌నాథ్: వరదల సమయంలో ఇతర విపత్తులు వచ్చిన సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగి తమ హెలికాఫ్టర్ల ద్వారా ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చిన సంఘనలను చూశాం. ఇక అదే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాఫ్టర్‌ కూలిపోగా దాని శిథిలాలను అత్యాధునిక చినూక్ హెలికాఫ్టర్ మోసుకెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

అది 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక హెలికాఫ్టర్ కేదార్‌నాథ్‌ ఆలయంకు సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ఐరన్ గర్డర్‌కు ప్రమాదవశాత్తు తగిలి కూలింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో కొందరు తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. మొత్తం ఆ హెలికాఫ్టర్‌లో ఎనిమిది మంది ప్రయాణం చేయగా అందులో పైలట్‌తో సహా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. రష్యాలో తయారైన MI-17 V5 మోడల్‌కు చెందిన చాపర్ ఇది. ఒక్కసారి ఢీ కొట్టగానే మంటలు చెలరేగాయి.

Video:IAF Chinook carries MI-17 chopper debris that crashed at Kedarnath in 2018

ఇక కట్ చేస్తే.. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం కూలిన హెలికాఫ్టర్‌కు సంబంధించిన శిథిలాలను అదే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక చినూక్ హెలికాఫ్టర్ ఢిల్లీకి మోసుకెళ్లింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోపల చిక్కుకున్న శిథిలాలను బలమైన గొలుసులతో బయటకు లాగారు. అయితే ఈ హెలికాఫ్టర్‌ను చినూక్ హెలికాఫ్టర్ మోసకెళుతున్న దృశ్యాలను చూసిన కొందరు నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు.

Recommended Video

    China టార్గెట్ గా Anti-Radiation Missile Rudram 1, DRDO టెస్టు సక్సెస్ | Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+