మాజీ సిఎం కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే...

రాజస్థాన్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాజీ సిఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌లో సోమవారం ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలోనే ఈ విచిత్ర సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రాజే కాళ్లు మొక్కిన జైన్‌: దివంగత తాన్ సింగ్ చౌహాన్ సంస్మరణ సందర్భంగా రాజ‌స్థాన్‌లో ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజస్థాన్‌ మాజీ సీఎం రాజే సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి బార్మర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మెవరమ్‌ జైన్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో బిజెపి, కాంగ్రెస్ నాయ‌కులంతా వ‌చ్చారు.

video of Congress MLA who touched the feet of former CM goes viral

అయితే, వారంతా నేల‌పై కూర్చుని ఉన్నారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే కూడా వ‌చ్చారు. అయితే, ఎమ్మెల్యే మెవ‌రమ్ జైన్ వ‌సుంధ‌రా రాజేను చూసి..అక్క‌డ నేల‌పై కూర్చ‌న్న వాళ్లను దాటుకుంటూ వెళ్లి రాజే కాళ్లుమొక్కి మ‌రీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో కాస్త ఆ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాన్‌సింగ్ చౌహాన్ ఎంద‌రికో స్పూర్తిదాయకం: ఈ వీడియో చూసిన రాజ‌కీయ నాయ‌కులు ప‌లువురు ప‌లుర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. జైన్‌ కాళ్లు మొక్కడం చూసిన వ‌సుంధ‌రా రాజే వెంటనే మైక్‌ చేతిలోకి తీసుకుని మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇది మనందరినీ ఏకం చేసేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మం అని ఆమె అన్నారు.

ఆ త‌ర్వాత రాజే మాట్లాడుతూ...మీడియా మిత్రులు నా మాటలు వినాలి. ఇది ఒక సామాజిక కార్యక్రమం. ఈ కార్యక్రమం 36 సామాజిక వర్గాలను కలుపడానికి పనిచేస్తుంది అంటూ పేర్కొన్నారు. అనంత‌రం దివంగత తాన్ సింగ్ చౌహాన్ గురించి మాట్లాడారు. తాన్ సింగ్ చౌహ‌న్ అందరినీ ఏక తాటిపై నడిపించిన వ్యక్తి. డ్రైవ‌ర్ ఉద్యోగం నుంచి ఓ ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన ఆయన విధానం మ‌న‌లాంటి వారెంద‌రికో స్పూర్తిదాయకం అని కొనియాడారు.

కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహ‌గానాలు: అయితే, వ‌సుంధ‌రా రాజే త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో చేరుతార‌న్న ఊహాగానాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే, దీనికి గ‌ల కార‌ణాలు లేక‌పోలేదంటున్నారు విశేష్ల‌కులు.. గ‌త కొద్దీకాలంగా రాజస్థాన్‌లోని బీజేపీ పెద్దలు వ‌సుంధ‌రా రాజేను పట్టించుకోవడం లేదని ఆమె త‌న సొంత పార్టీపైనే ఆగ్రహంగా ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ విష‌యంపై గ‌త కొంత‌కాలంగా వ‌సుంధ‌రా రాజే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే ఇటీవల రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను వసుంధరా రాజే క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+