ఆల్ ది బెస్ట్: మానుషి ఛిల్లర్‌కు సుస్మితా సేన్ సలహలు:వీడియో వైరల్

న్యూఢిల్లీ: ప్రపంచ సుందరి మానుషి ఛిల్లర్, మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత్ సేన్ విమానంలో కలుసుకొన్నారు. సుస్మితా సేన్ మానుషి ఛిల్లర్ చేతి మీద ముద్దు పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.

హర్యానాకు చెందిన 20 ఏళ్ల మానుషి ఛిల్లర్‌.. మిస్‌ వరల్డ్‌ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పింది. మిస్‌ వరల్డ్‌ మానుషి.. మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ను విమానంలో కలిశారు.

Sush & Miss Word 2017 Manushi Chhillar❤️✈️ #sushmitasen #manushichillar

A post shared by Sushmita Sen Fanpage (@voguesush) on

ఆమె మిస్‌ వరల్డ్‌ పోటీలకు రెడీ అవుతున్న సమయంలో వీరి కలయిక జరిగింది. ఈ బామలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో వారిద్దరూ మాట్లాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. మానుషి.. సుస్మితాను చూసి షాక్‌కు గురయ్యాను. ఆమె నన్ను అభిమానంతో పలకరించారు. అంతేకాక మానుషికి సుస్మితా సేన్‌ ఐడియాలిచ్చారు.

మన వంతు ప్రయత్నాం మనం చేయాలి.. మిగతాది దేవుడి మీద భారం వేయాలని.. ఆల్‌ ది బెస్ట్‌ అని చెబుతూ మానుషి చేతికి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

సుస్మితా సేన్‌ 1994 సంవత్సరంలోనే ఫెమినా మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌లను కైవసం చేసుకున్నారు. ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్‌ వశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+