తమిళనాడులో విజయ్-బీజేపీ పొత్తుపై తేల్చేసిన టీవీకే, పవన్..!

తమిళనాడు (tamil nadu)లో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు వీలుగా నిన్న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో అధికార డీఎంకే కూటమిని గద్దె దింపాలంటే తమకు బలమైన కూటమి అవసరమని బీజేపీ (BJP) భావిస్తోంది. అందుకే హీరో విజయ్ (Vijay) పార్టీ టీవీకే (TVK)తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు విజయ్ ఇప్పటికే బీజేపీతో పొత్తు లేదని చెప్పేసినా, తాజాగా ఆయనకు కాషాయ పార్టీ డిప్యూటీ సీఎంతో పాటు 80 సీట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీవీకే నేత సెంగొట్టయాన్ తో పాటు ఎన్డీయే భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఎన్డీయేలో విజయ్ ను తీసుకొచ్చే టాస్క్ ను బీజేపీ పవన్ కళ్యాణ్ కు అప్పగించిదంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలో స్పందించారు. తనవైపు నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తనకు తెలియదన్నారు. విజయ్ ను తాను కలిసి పాతికేళ్లు అవుతుందన్నారు. దీంతో పవన్ మధ్యవర్తిత్వం పుకార్లకు చెక్ పడింది.

Vijay-BJP Alliance Talks TVK and Pawan Kalyan Issue Separate Clarifications

మరోవైపు టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చారని, ఉపముఖ్యమంత్రి పదవికి అవకాశం లేదని పార్టీ ప్రధాన సమన్వయకర్త సెంగోట్టయ్యన్ తేల్చిచెప్పారు. బీజేపీ విజయ్‌ను తమ కూటమిలోకి ఆకర్షించేందుకు ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వంటి పదవులు ఆఫర్ చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేవారితో మాత్రమే తాము పొత్తు పెట్టుకుంటామన్నారు. ఉపముఖ్యమంత్రి పదవికి అసలు అవకాశం లేదన్నారు. అలాగే టీవీకే పార్టీకి 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేయడానికి సమర్థులైన అభ్యర్థులున్నారని, ఎన్డీయే తో పొత్తుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+