విజయ్ కు బిగ్ షాక్.. తొలిరోజే ఎన్నికల ప్రచారం రద్దు..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార డీఎంకే పార్టీ మరోసారి గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే పార్టీ ఈసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ దళపతి టీవీకే పార్టీ అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు విజయ్ చూట్టూనే తిరుగుతున్నాయి.
టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈరోజు(మార్చి 30) నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈ మేరకు పెరంబూర్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే గతంలో కరూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో విజయ్ ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తాజాగా కోలత్తూరులో నిర్వహించిన సభకు భారీగా జనం తరలిరావడంతో పోలీసుల ఆదేశాల మేరకు కేవలం 2 నిమిషాల్లోనే విజయ్ తన ప్రసంగాన్ని ముగించారు. దాదాపు 100 మీటర్ల దూరంలోనే విజయ్ ప్రసంగం చేశారు.
మరోసారి కరూర్ లాంటి ఘటనలు జరగకుండా పోలీసుల ఆదేశాల మేరకు విజయ్ కేవలం 2 నిమిషాల్లోనే ప్రసంగాన్ని పూర్తిచేశారు. మరోవైపు పెరంబూర్, కొలత్తూర్ తర్వాత విజయ్ తన ఎన్నికల ప్రచారాన్ని విల్లివక్కమ్ లో ప్రారంభించాల్సి ఉంది. అయితే అక్కడ ఎన్నికల ప్రచారం క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని థావేక జిల్లా సెక్రటరీ పుకథాయి కుమార్ వెల్లడించారు. కొలత్తూరులో విజయ్ కు సరైన భద్రత కల్పించలేదని అన్నారు. విల్లివక్కమ్ లో విజయ్ మరోసారి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు.
అయితే విల్లివక్కమ్ నియోజకవర్గంలో విజయ్ ఎన్నికల ప్రచారం ఆగిపోవడానికి కారణం.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. ట్రాఫిక్ రద్దీ, భద్రతా కారణాల దృష్ట్యా విజయ్ కు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. విల్లివక్కమ్ లో టీవీకే తరఫున పోటీ చేస్తున్న ఆధవ్ అర్జునకు మద్దతుగా విజయ్ రోడ్ షో నిర్వహించాల్సి ఉంది.

అయితే ఉదయానికే విల్లివక్కమ్ బస్ స్టాండ్ వద్ద వేల సంఖ్యలో వాలంటీర్స్, అభిమానులు చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అయితే విల్లివక్కమ్ లో రోడ్లు చాలా సన్నగా ఉంటాయి. అందువల్ల మరోసారి కరూర్ లాంటి తొక్కిసలాట ఘటనలు జరుగుతుందన్న అనుమానంతో పోలీసులు విజయ్ కు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications