విజయ్-త్రిష పెళ్లి? తమిళనాడు ఎన్నికల వేళ అదిరే ట్విస్ట్!
ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల మధ్య ఉన్న బంధంపై వస్తున్న పుకార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాత కుమారుడి వివాహ వేడుకలో వీరిద్దరూ కలిసి కనిపించడం, పైగా మ్యాచింగ్ దుస్తులు ధరించడంతో వీరిద్దరి బంధంపై చర్చ మళ్లీ మొదటికొచ్చింది.
ఎన్నికలకు ముందే వివాహం?
ప్రస్తుతం వినిపిస్తున్న అత్యంత సంచలన వార్త ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ.. సోషల్ మీడియా యూజర్లు మాత్రం రకరకాల ఊహాగానాలతో పోస్ట్ులు పెడుతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని కొందరు కోరుతున్నా.. రూమర్లు మాత్రం ఆగడం లేదు.

రాజకీయ కోణం: మే 4వ తేదీకి ఉన్న లింక్ ఏంటి?
తమిళనాడు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన తరుణంలో ఈ పుకార్లు విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం'పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాట ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. మే 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మే 4వ తేదీనే త్రిష పుట్టినరోజు కావడం గమనార్హం. ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే త్రిష పుట్టినరోజు కావడంతో ట్రోలర్స్ దీనిని విజయ్ రాజకీయ విజయంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇది విజయ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర అని మద్దతుదారులు వాదిస్తున్నారు.
మద్దతుగా నిలిచిన ఖుష్బూ సుందర్
ఈ వివాదంపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ స్పందించారు. త్రిషకు మద్దతుగా నిలుస్తూ.. "త్రిష చాలా మంచి వ్యక్తి. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆమెకు లేదు" అని పేర్కొన్నారు. త్రిష వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రవర్తించవద్దని ఆమె నెటిజన్లను కోరారు.
విజయ్ రాజకీయ ప్రయాణానికి అడ్డంకిగా మారుతుందా?
తమిళనాడు రాజకీయాల్లో ఇమేజ్ అనేది చాలా ముఖ్యం. ప్రత్యర్థి పార్టీలు ఈ వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసే అవకాశం ఉందనే భయం అభిమానుల్లో నెలకొంది. తన సినీ కెరీర్‌ను వదిలి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు, ఈ రూమర్లు ఒక సవాల్‌గా మారాయి. స్తుతానికి విజయ్ కానీ, త్రిష కానీ ఈ పెళ్లి వార్తలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది కేవలం పుకారుగానే మిగిలిపోతుందా లేదా విజయ్ రాజకీయ ప్రయాణంలో ఏదైనా మార్పుకు కారణమవుతుందా అనేది వేచి చూడాలి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications