Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఒకరు మృతి, 25 మందికి గాయాలు

మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. శనివారం రాష్ట్రంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో కుకి ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడు మృతి చెందాడు. 25 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో మహిళలు కూడా ఉన్నారని చెప్పారు.

మరణించిన వ్యక్తిని లాల్‌గౌతాంగ్ సింగ్సిట్ (30)గా గుర్తించారు. కైథెల్మాన్‌బిలో జరిగిన ఘర్షణలలో అతనికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. గంగిఫై, మోత్బుంగ్, కైథెల్మాన్‌బి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో కనీసం 25 మంది ఆందోళనకారులు గాయాలపాలయ్యారు. వీరిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ప్రజారోగ్య కేంద్రానికి తరలించారు.

Violence erupts again in Manipur state One dead 25 injured

కుకి మెజారిటీ ఉన్న ఈ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. రహదారులపై పెద్ద పెద్ద రాళ్లను పడవేశారు. రహదారులపై వెళుతున్న వాహనాలపైకి రాళ్లు విసిరారు. దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు.

దీంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఆందోళనకారులు ప్రైవేట్ వాహనాలను తగలబెట్టడంతో పాటు ఇంఫాల్ నుంచి సేనపతి జిల్లాకు వెళ్తున్న రాష్ట్ర రవాణా బస్సుపై దాడికి ప్రయత్నించారు.

NH-2 (ఇంఫాల్-డిమాపూర్ హైవే)పై ప్రభుత్వ వాహనాల రాకపోకలను అడ్డుకోవడానికి టైర్లను తగలబెట్టారు నిరసనకారులు. ఈ నిరసన మైతేయి గ్రూపు అయిన ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సోసైటీ (FOCS) నిర్వహించిన శాంతి యాత్రను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. పదికి పైగా వాహనాలతో కూడిన ఈ యాత్రను కాంగ్‌పోక్పి జిల్లా చేరుకునే ముందు సెక్మై వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. పోలీసులు అనుమతి లేకపోవడం వల్ల ర్యాలీని ఆపాలని ఆదేశించారు.

"మేము కేవలం ఆదేశాలను పాటిస్తున్నాము. ర్యాలీని ఆపాలని మాకు చెప్పారు. వారు వెళ్లాలనుకుంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర బస్సుల్లో వెళ్లవచ్చు' అని ఒక పోలీస్ అధికారి తెలిపారు. అయితే, FOCS సభ్యులు శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛా సంచారం కోసం అమిత్ షా ఇచ్చిన ఆదేశాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ కుకీ ఆందోళనకారులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+