Viral: మందుబాబులకు షాక్..! లిక్కర్ బిల్లుపై 20 శాతం ఆవు సెస్..?
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో తాజాగా ఓ ఘటన చర్చనీయాంశమైంది. మద్యం తాగేందుకు ఓ బార్ కు వెళ్లిన మందుబాబుకు బిల్లు చూసి షాక్ తగిలింది. అందులో తాను తాగిన బీరుపై వ్యాట్ విధించడంతో పాటు దానిపై 20 శాతం ఆవు సెస్ (ఆవు పన్ను) విధించారు. దీంతో అతను ఈ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇది చూసిన నెటిజన్లు సెటైర్లు వేయడం ప్రారంభించారు. మందుబాబుల బలహీనతను ఇలా కూడా సొమ్ము చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
సెప్టెంబర్ 30న జోధ్‌పూర్ పార్క్ ప్లాజాలోని జియోఫ్రీ బార్‌లో కస్టమర్ మొక్కజొన్న వడలు, ఆరు బీర్లను ఆర్డర్ చేసినట్లు బిల్లులో కనిపిస్తోంది. ఈ ఆర్డర్ మొత్తం విలువ రూ. 2,650. అలాగే దీనిపై జీఎస్టీ, వ్యాట్, 20% ఆవు సెస్ తర్వాత బిల్లు మొత్తం రూ. 3,262కి చేరింది. అంటే మద్యం బిల్లుపై దాదాపు 600 రూపాయలకు పైగా పన్నుల మోత మోగినట్లు అర్దమవుతోంది. ఇందులో ఆవుసెస్ మాత్రమే 20 శాతం ఉండటంపై చర్చ జరుగుతోంది. ఇందులో ఉన్న ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధించారు.

దీంతో ఈ వ్యవహారంపై రాజస్థాన్ తో పాటు ఇతర హిందీ రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. రాజస్థాన్ లో ప్రభుత్వం ఆవులతో పాటు గోశాలలను పరిరక్షించే ఉద్దేశంతో మద్యంపై ఈ ఆవుసెస్ ను విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది 2018 నుంచి అమల్లో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయినా ఇలా మద్యంపై ఆవు సెస్ విధించి వసూలు చేసుకోవడం వెనుక లాజిక్ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే 2018 నుంచి ఇలా మద్యంపై 20 ఆవు పన్నును విధిస్తున్నప్పటికీ దీన్ని బార్లు, రెస్టారెంట్లు మాత్రం సర్ ఛార్జ్ గా పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. అందుకే దీనిపై చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు నేరుగా ఆవు సెస్ అని డైరెక్ట్ గా బిల్లులోనే పేర్కొనడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అప్పట్లో ప్రభుత్వం 24 శాతం వరకూ ఆవు సెస్ కింద వసూలు చేసుకోవచ్చని మద్యం షాపులు, బార్లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications