వైర‌ల్ వీడియో : ఎన్నిక‌ల్లో గెలుపు కోసం బాబాతో చెప్పు దెబ్బ‌లు తిన్న‌ కాంగ్రెస్ అభ్య‌ర్థి...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వింత వింత ఘ‌ట‌న‌లు తార‌స‌ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి అభ్య‌ర్థులు ఎలాంటి ప‌నులైనా చేస్తారు. ఎంత‌టి వాటికైనా సిద్ధ‌ప‌డుతుంటారు. చాలామంది రాజ‌కీయ‌నాయ‌కులు ఎక్కువ‌గా బాబాల‌ను, మూఢ‌న‌మ్మ‌కాల‌ను ఎక్కువ‌గా న‌మ్మ‌డం చూస్తుంటాం. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్య‌ర్థులు చాలామంది బాబాల ద‌ర్శ‌నం కూడా చేసుకుంటుంటారు. అయితే, ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఓ అభ్య‌ర్థి ఏకంగా బాబాతో చెప్పుదెబ్బ‌లు తిన్నాడు. ఇప్ప‌డు దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

రత్లాం నియోజకవర్గం నుంచి పరాస్‌ సక్లేచా బరిలో : మ‌ధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. అయితే, అక్క‌డ మొత్తం 230 అసెంబ్లీ స్థానాల‌కు గాను ఉదయం ఆరు నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. 2533 మంది ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తర‌పు నుంచి పరాస్‌ సక్లేచా బరిలో దిగారు. అయితే, ఆయ‌న తన గెలుపుకోసం ఓ బాబాతో చెప్పు దెబ్బ‌లు తిన్నాడు. అయితే, ఈయ‌న ఎవరూ ఊహించని విధంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఫకీర్‌ బాబాతో చెప్పుతో కొట్టించుకున్నాడు. కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌రాస్ స‌క్లేచా ముందుగా ఓ జత కొత్త చెప్పులు కొనుక్కొన్నారు.

 Viral video: Congress candidate who was beaten by Baba to win the election...

ఫకీర్‌ బాబాతో చెప్పుతో కొట్టించుకున్నాడు : ఆ త‌ర్వాత రోడ్డు పక్కన ఉండే ఫకీర్‌ బాబా ద‌గ్గ‌రికి వెళ్లాడు. ఆయ‌న‌కి ఆ కొత్త చెప్పులను ఇచ్చాడు. వాటిని తీసుకున్న ఆ బాబా పరాస్ నెత్తిపై చెడామడా వాయించేశాడు. ఆ త‌ర్వాత వాటితో ప‌రాస్ చెంపలు చెళ్లుమనేలా దెబ్బ‌లు కొట్టాడు. అయితే, బాబా కొడుతున్నంత‌సేపు పరాస్ ఆనందంతో ఉబ్బిత‌బ్బియిపోయాడు. ఆయనతో చెప్పు దెబ్బలు తింటే ఎన్నికల్లో విజయం తథ్యమనే ఉద్దేశంతోనే ఆయనిలా చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే చెప్పు దెబ్బ దృశ్యాలు మాత్రం నెట్టింట తెగ వైర‌ల్‌గా మారాయి.

వీటిని చూసిన నెటిజ‌న్లు మాత్రం కాస్త భిన్నంగానే స్పందిస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇలాంటి ప‌నులు కూడా చేస్తారా? అంటూ కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 47 స్థానాల‌ను ఎస్టీ, 35 స్థానాలు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేయ‌డం జ‌రిగింది. ఈ రోజు జ‌రిగే పోలింగ్ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాలైన బాలాఘాట్‌, మండ్ల‌, దిందోరి జిల్లాలో మాత్రం మూడు గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే పోలింగ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+