Viral Video: దేవుడికి పూజ చేసిన హ్యూమనాయిడ్ రోబో.. నెటిజన్లు ఫిదా!

టెక్నాలజీ పెరిగిన తర్వాత నిత్యం సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఉజ్జయినిలోని ఒక కొత్త సాండ్ విచ్ షాప్ ప్రారంభోత్సవంలో ఒక రోబో సందడి చేసింది. కేవలం ప్రారంభోత్సవానికి రావడం మాత్రమే కాదు.. స్వయంగా దేవుడికి పూజ చేసి, రిబ్బన్ కట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న వారితో కలిసి స్టెప్పులేసింది. హ్యూమనాయిడ్ రోబో చేసిన ఈ విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి జనాలను బాగా ఆకట్టుకున్నాయి.

Viral Video From Ujjain Store Launch to Galgotias Controversy The Real Story Behind Viral Robot in India
Robo Art: రోబో పెయింటింగ్‌కు ఆర్ట్ వరల్డ్‌ ఫిదా.. కళాకృతి విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..
Robo Art: రోబో పెయింటింగ్‌కు ఆర్ట్ వరల్డ్‌ ఫిదా.. కళాకృతి విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..

అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్' ఎక్స్‌పోలో గాల్గోటియాస్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ సెంటర్ స్వయంగా రూపొందించిందంటూ 'ఒరియాన్' అనే రోబోటిక్ డాగ్‌ను ప్రదర్శించారు. కానీ, తీరా చూస్తే అది చైనాకు చెందిన 'యూనిట్రీ' కంపెనీ తయారు చేసిన రోబో అని నెటిజన్లు నిమిషాల్లో కనిపెట్టేశారు.

Us<strong>ain Bolt రికార్డ్ బద్దలైంది. తుఫాన్ వేగంతో రోబో పరుగు: Video</strong>
Usain Bolt రికార్డ్ బద్దలైంది. తుఫాన్ వేగంతో రోబో పరుగు: Video

ప్రచార ఆర్భాటం వెనుక దాగివున్న నిజాలు

సొంత పరిజ్ఞానంతో రూపొందించామని చెప్పి, మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే చైనా రోబోను ప్రదర్శించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. విదేశీ పరిజ్ఞానాన్ని తమ సొంత ప్రయోగంగా చిత్రీకరించుకోవడం జాతీయ స్థాయిలో పెద్ద వివాదంగా మారింది. మన దగ్గర సాంకేతికత పేరిట జరుగుతున్న ఇలాంటి ఆర్భాటాల వెనుక అసలు నిజాలు ఏమిటనేది గ్రహించడం చాలా అవసరమని ఈ రెండు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+