Viral Video: రైలు భోగీని వంటగదిగా మార్చేసిన మహిళలు.. ఏసీ కోచ్ లో శాండ్విచ్‌లు తయారీ!

ట్రైన్ జర్నీ అంటేనే ఒక సరదా అనుభవం. విండో పక్కన కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడం, తోటి ప్రయాణీకులతో కబుర్లు చెప్పుకోవడం, ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఓపెన్ చేసి అందరూ కలిసి తినడం.. ఇవన్నీ కామన్. కానీ, ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే షాక్ అవ్వడం మీ వంతు. ఒక గుజరాతీ కుటుంబం రైలు భోగీని ఏకంగా తమ సొంత వంటగదిగా మార్చేసింది. బెర్తులపైనే పేపర్లు పరిచి, పిండి వంటలు సిద్ధం చేస్తున్నట్లుగా శాండ్విచ్లు తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

రైలు బెర్తులే కిచెన్ ప్లాట్‌ఫారాలు.. బెర్తు నిండా పేపర్ల పరపు

ఆ వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రకారం.. 3AC కంపార్ట్‌మెంట్‌లో ఒక గుజరాతీ కుటుంబం ప్రయాణిస్తోంది. రైలు కదులుతుండగానే, ఆ కుటుంబంలోని మహిళలు చురుగ్గా పనిలో నిమగ్నమయ్యారు. తమకు కేటాయించిన మిడిల్ బెర్తు, పక్క సీట్లపై ముందుగా న్యూస్‌పేపర్లను పరిచారు. ఆ తర్వాత ఆ పేపర్లపైన బ్రెడ్ ముక్కలు, కూరగాయలు, చట్నీలు, ఇతర సామాగ్రిని అమర్చారు. ఒకరి తర్వాత ఒకరు శాడ్వించ్లు తయారు చేస్తూ, పక్కనున్న వారికి అందిస్తున్నారు. వంటగదిలోని ఎలాగైతే వంట చేస్తారో, అలాగే రైలు బెర్తులను వాడుకుంటూ వారు చేస్తున్న 'వంటా వార్పూ' చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Viral Video Shows Gujarati Family Turning Train Compartment Berths Into Makeshift Kitchen to Make Sandwiches

"టోస్టర్ తెచ్చుకుంటే గ్రిల్డ్ సాండ్‌విచ్‌లు తినేవాళ్లం" : మహిళ ఆవేదన

ఈ వంట ప్రక్రియ కొనసాగుతుండగా, ఆ కుటుంబంలోని ఒక మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. శాండ్విచ్లు తయారు చేస్తున్న సమయంలో ఆమె, " టోస్టర్ తెచ్చుకుంటే బాగుండేది. అది ఉంటే, శాండ్విచ్లను గ్రిల్ చేసి ఇంకా రుచిగా తినేవాళ్లం" అని వ్యాఖ్యానించింది. రైలు భోగీనే కిచెన్‌గా మార్చేసిన వీరు, ఇంకా టోస్టర్ కూడా తెచ్చుకోవాల్సిందని అనుకోవడం చూసి నెటిజన్లు వామ్మో! అంటున్నారు. ఆ మహిళ మాటలు ఇప్పుడు ఈ వీడియోకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి.

Video: LKG చిన్నారిపై రాక్షసత్వం! రాళ్ళు, పూల కుండీలతో థర్డ్ క్లాస్ స్టూడెంట్ దాడి
Video: LKG చిన్నారిపై రాక్షసత్వం! రాళ్ళు, పూల కుండీలతో థర్డ్ క్లాస్ స్టూడెంట్ దాడి

అభిమానం ఒకరిది.. అభ్యంతరం మరొకరిది : నెటిజన్ల భిన్న స్పందనలు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ కుటుంబం చేసిన పనిని సరదాగా తీసుకుంటుంటే, మరికొంతమంది మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ సౌకర్యం కోసం ఇలాంటి పనులు చేయడం తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని కొందరు వాదిస్తున్నారు. రైలు అనేది ప్రయాణం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ప్రదేశమని, వంటలు చేసుకోవడానికి కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

రైల్వే చట్టాలు ఏం చెప్తున్నాయి? భద్రతపై ప్రశ్నలు

రైలు ప్రయాణంలో ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినడం సాధారణమే అయినా, రైలు భోగీలోనే ఆహారాన్ని తయారు చేయడం మాత్రం రైల్వే చట్టాలకు విరుద్ధం. రైల్వే చట్టం 1989, సంబంధిత భద్రతా నిబంధనల ప్రకారం.. రైలు కోచ్‌లలో వంట చేయడం నిషిద్ధం. రైలు అనేది పరిమితమైన స్థలం, ఇందులో ప్రయాణీకులు, వారి సామాగ్రి, ఎలక్ట్రికల్ పరికరాలు అన్నీ ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో వంట చేయడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఘటన రైలు ప్రయాణంలో భద్రతా నిబంధనల పాటింపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

వైరల్ వీడియో: ఇది రైలనుకున్నారా..? లేక..
వైరల్ వీడియో: ఇది రైలనుకున్నారా..? లేక..

సామాజిక బాధ్యత ఎక్కడ? ప్రయాణీకుల ప్రవర్తనపై చర్చ

ఈ ఘటన మరోసారి రైలు ప్రయాణీకుల ప్రవర్తన, సామాజిక బాధ్యతపై చర్చకు తెరలేపింది. రైలు అనేది ఒక పబ్లిక్ స్పేస్, ఇందులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తోటి ప్రయాణీకుల సౌకర్యాన్ని గౌరవించాలి. వ్యక్తిగత సౌకర్యం కోసం తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉదయిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రైలును శుభ్రంగా ఉంచుకోవడం వంటి విషయాల్లో ప్రయాణీకులు బాధ్యతగా వ్యవహరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+