Video: LKG చిన్నారిపై రాక్షసత్వం! రాళ్ళు, పూల కుండీలతో థర్డ్ క్లాస్ స్టూడెంట్ దాడి

పాఠశాల అంటే విద్యార్థులకు విజ్ఞానాన్ని ఇచ్చే దేవాలయం మాత్రమే కాదు, సురక్షితమైన ఆశ్రయం కూడా. మరీ ముఖ్యంగా ఎలిమెంట్రీ స్కూల్లో పిల్లలు ఆడుకుంటారు, చదువుకుంటారు.. వాళ్లలో వాళ్లే గొడవ పడతారు. కానీ ఆ గొడవ ప్రాణాల మీదకు వస్తే మాత్రం పసిప్రాణాలకు ముప్పే. హర్యానాలోని పంచకుల సన్స్కృతి మోడల్ స్కూల్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఉదంతం పాఠశాలల్లో పిల్లల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న ఎల్కేజీ చదువుతున్న ఒక చిన్నారిపై, అదే పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి రాళ్ళు, పూల కుండీలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఊహించని ఘాతుకంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది.

రాళ్ళు, కుండీలతో రాక్షసంగా..

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆ మూడో తరగతి విద్యార్థి మొదట చిన్నారిపై రాళ్ళతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా దగ్గరలోనే ఉన్న ఒక బరువైన పూల కుండీని తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆ చిన్నారి స్పృహ తప్పి కింద పడిపోయినప్పటికీ, ఆ బాలుడు ఆమెపైకి రాళ్ళు విసరడం ఆపలేదు. అనంతరం ఆ పాపను కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. రక్తమడుగులో స్పృహతప్పి పడివున్న ఆ చిన్నారిని చూసి పాఠశాల సిబ్బంది వెంటనే తేరుకుని ఆసుపత్రికి తరలించారు.

Panchkula School Shock Class 3 Student Attacks KG Girl With Flower Pot and Stones Inside Campus

ఆసుపత్రిలో చికిత్స.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం!

తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, చిన్నారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చండీగఢ్‌లోని పీజీఐ (PGI) ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రమాదం తప్పిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

viral video: సినిమా టికెట్ల కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..
viral video: సినిమా టికెట్ల కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..

రంగంలోకి దిగిన పోలీసులు.. యాజమాన్యంపై ప్రశ్నలు!

సంఘటన సమాచారం అందగానే సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ యశ్‌దీప్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్‌లతో కూడిన పోలీస్ బృందం పాఠశాలకు చేరుకుని ప్రాథమిక విచారణ ప్రారంభించింది. స్కూల్ పనివేళల్లో అంత చిన్న పిల్లలపై పర్యవేక్షణ లోపించడం పట్ల పోలీసులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఉపాధ్యాయులు లేదా సిబ్బంది ఎక్కడ ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

కలకలం: ఉప్పల్‌లో ఎల్కేజీ చిన్నారి కిడ్నాప్
కలకలం: ఉప్పల్‌లో ఎల్కేజీ చిన్నారి కిడ్నాప్

ఘటనకు గల కారణాలపై ఆరా!

అంత చిన్న వయసున్న మూడో తరగతి బాలుడు అంతటి తీవ్రమైన దాడికి ఎందుకు పూనుకున్నాడనే విషయమై పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలోని మార్పులు, ఈ దాడికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు సమగ్రంగా ఆరా తీస్తున్నారు. పసిపిల్లలను పాఠశాలలకు పంపే తల్లిదండ్రుల్లో ఈ ఉదంతం తీవ్ర భయాందోళనలను రేకెత్తించడమే కాకుండా, స్కూళ్లలోని సెక్యూరిటీ, పర్యవేక్షణ ఏర్పాట్లపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+