వైరల్ వీడియో: రద్దీ రోడ్డుపై దొంగల ధైర్యం.. ఎంతకు తెగించార్రా!
Viral Video: గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న ఓ వింత దొంగతనంలో దొంగలు తాళం చెవి లేకుండానే రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న స్కార్పియో ఎస్‌యూవీని ఎత్తుకెళ్లారు. మొదట దొంగలు ఆ స్కార్పియో ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత వారు ఒక థార్ వాహనాన్ని తీసుకువచ్చి స్కార్పియోకు తాడు కట్టి దాన్ని లాక్కెళ్లారు.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. థార్ వాహనం స్కార్పియో వైపు రివర్స్ చేసింది. థార్ నుంచి దిగిన ఓ వ్యక్తి తాడును తీసి స్కార్పియో ముందు భాగానికి గట్టిగా కట్టాడు. ఆ తర్వాత థార్ వేగంగా ముందుకు దూసుకెళ్లింది. థార్ వాహనం కదలడంతో దాని వెనుక కట్టబడిన స్కార్పియో కూడా కదిలింది. అలా దొంగలు పార్క్ చేసిన స్కార్పియో వాహనాన్ని ఎత్తుకెళ్లారు. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

अगर इंसान ठान ले तो क्या नहीं कर सकता! 😄
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) October 6, 2025
गुरुग्राम में चोरों ने पहले एक स्कॉर्पियो स्टार्ट करके ले जाने की कोशिश की — जब सफल नहीं हुए, तो एक थार लाये, स्कार्पियो को रस्सी से बाँधा और घसीटकर ले गए! pic.twitter.com/LaHqQtRtzq
పెరుగుతున్న అధునాతన దొంగతనాలు
ఆధునిక వాహన భద్రతా వ్యవస్థలలోని బలహీనతలను ఉపయోగించుకుని కీ లేకుండానే కార్లను దొంగిలించే సంఘటనలు భారతదేశంలో పెరుగుతున్నాయి. కారు కీ ఫోబ్ నుంచి వచ్చే సిగ్నళ్లను దొంగిలించి వాహనాన్ని అన్‌లాక్ చేసి స్టార్ట్ చేసే రిలే దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. క్రిమినల్స్ హై-ఎండ్ కార్లను దొంగిలించడానికి జీపీఎస్ జామర్లు, ఫేక్ ఐడీలు, ఓబీడీ పోర్ట్ హ్యాక్‌లను కూడా ఉపయోగిస్తారు.
ఇంతకు ముందు నోయిడాలో ఓ గ్యాంగ్ అధిక రీసేల్ విలువ ఉండే మారుతి బ్రెజ్జా కార్లను లక్ష్యంగా చేసుకుంటే.. చెన్నైలో సన్-కంట్రోల్ ఫిల్మ్ ఏర్పాటు చేస్తామని యజమానులను ఆకర్షించి కార్లను దొంగిలించారు. ఢిల్లీలో ఓ కుటుంబ గ్యాంగ్ అధునాతన టూల్స్ ఉపయోగించి పది నెలల్లో 20కి పైగా ఎస్‌యూవీలను దొంగిలించింది.












Click it and Unblock the Notifications