Viral Video: పోలీసుల దారుణం: మృతదేహాన్ని చెత్తలా పడేసి పారిపోయారు!

Viral Video: ఉత్తరప్రదేశ్ పోలీసుల అత్యంత సిగ్గుచేటైన, అమానవీయ చర్య మీరట్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ గుర్తు తెలియని మృతదేహం కేసును తమ స్టేషన్ పరిధిలోకి రాకుండా తప్పించుకోవాలనే ఏకైక ఉద్దేశంతో ముగ్గురు పోలీసు సిబ్బంది ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి మరో పోలీస్ స్టేషన్ పరిధిలో విసిరేశారు. ఈ చర్య పోలీసు వ్యవస్థలోని అంతర్గత వైఫల్యాన్ని, కేసు నమోదుపై ఉన్న భయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

సీసీటీవీలో రికార్డైన దారుణం
మీరట్‌లోని లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వివాదాస్పద సంఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు పోలీసులు బైక్‌పై వచ్చారు. వారిని అనుసరిస్తూ ఒక ఈ-రిక్షా వచ్చింది. ఆ ఇద్దరు పోలీసు సిబ్బంది కొంత సమయం పాటు మృతదేహాన్ని పడేయడానికి అనువైన చీకటి స్థలం కోసం వెతికారు. స్థలాన్ని నిర్ధారించుకున్న తర్వాత వారు ఈ-రిక్షా నుంచి మృతదేహాన్ని దించి, మూసి ఉన్న ఒక దుకాణం వెలుపల ఉంచారు. ఆ తర్వాత వెంటనే ఈ-రిక్షాను పంపించి కొద్ది సెకన్లలోనే ఆ ఇద్దరు పోలీసులు కూడా అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. ఈ మొత్తం దారుణాన్ని ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజల్లో పోలీసుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

Viral Video UP Police Suspended for Dumping Unidentified Dead Body in Meerut

ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఈ సమాచారం, వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగానే, ఈ అమానవీయ చర్యపై తీవ్రంగా స్పందించారు. మృతదేహాన్ని తరలించి.. దానితో అగౌరవంగా వ్యవహరించినందుకు గానుఎల్ బ్లాక్ చౌకీ ఇన్‌ఛార్జ్ జితేంద్ర, కానిస్టేబుల్ రాజేష్, హోంగార్డ్ రోహతాష్‌లను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురిపై అంతర్గత విచారణ కొనసాగుతోంది.

వ్యవస్థాగత వైఫల్యంపై విమర్శలు
పోలీసు సిబ్బంది కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఇలాంటి చర్యకు పాల్పడటం అనేది కేవలం వ్యక్తిగత లోపం మాత్రమే కాదని, వ్యవస్థాగత లోపాలను కూడా ఎత్తి చూపుతోంది. మృతదేహం తమ పరిధిలో దొరికితే హత్య లేదా ఆకస్మిక మరణం కింద కేసు నమోదు చేయాల్సి వస్తుంది. దీని వల్ల పోలీస్ స్టేషన్‌పై కేసుల సంఖ్య పెరుగుతుంది. కొన్నిసార్లు, పోలీసు స్టేషన్ల పనితీరును అంచనా వేసేటప్పుడు కేసుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. ఈ కారణంగానే, కేసు నమోదును తప్పించుకోవడానికి సరిహద్దు వివాదాలను సృష్టించడం లేదా మృతదేహాలను తరలించడం వంటి అనైతిక పనులకు పాల్పడుతున్నారు. ఈ ఘటన భారత పోలీసు వ్యవస్థలో పారదర్శకత, మానవత్వంతో కూడిన విధానం ఎంత అవసరమో మరోసారి తెలియజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+