సీఎం విజయ్ నిర్ణయం పై విశాల్ ఫైర్, సంచలన డిమాండ్..!!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం వరకు పూర్తి మద్దతు ప్రకటించిన విజయ్ ఊహించని షాక్ ఇచ్చారు. సీఎం విజయ్ నిర్ణయాల పైన తాజాగా విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. సీఎం విజయ్ ముందు విశాల్ మూడు కీలక డిమాండ్లు ఉంచారు. విజయ్ తన నిర్ణయాన్ని సమీక్షించి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. చలనచిత్ర సాంకేతికత మరియు సినిమాటోగ్రఫీ శాఖను సీనియర్ నేత రాజమోహన్ కు అప్పగించారు. దీని పైన హీరో విశాల్ ఘటుగా స్పందించారు. గత 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో క్షేత్రస్థాయి నుంచి ఉంటూ, పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన సీఎం విజయ్ కాకుండా... సినిమా రంగంపై కనీస అవగాహన మరియు అనుభవం లేని వ్యక్తికి ఈ శాఖను కేటాయించడం పట్ల విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా నిర్మాతలు తమ సమస్యలను మరియు సంస్కరణలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం కాదని, కేవలం పరిశ్రమ బాగు కోసమే తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నానని స్పష్టం చేశారు.

ఇక్కడా విజయ్ పార్టీ విస్తరణ, టార్గెట్ ఫిక్స్ - రంగంలోకి స్ట్రాటజిస్టులు..!!
ఇక్కడా విజయ్ పార్టీ విస్తరణ, టార్గెట్ ఫిక్స్ - రంగంలోకి స్ట్రాటజిస్టులు..!!
vishal-questions-vijay-s-choice-of-rajmohan-for-film-technology-portfolio-as-latest-allotment-here

సీఎం విజయ్ ముందు కీలక డిమాండ్లు

అదే సమయంలో గత 9 ఏళ్లుగా పరిష్కారం కాని పలు కీలక డిమాండ్లను సీఎం విజయ్ ముందు ఉంచారు. ప్రస్తుతం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ కోసం ప్రేక్షకులు అదనంగా రూ. 30 వరకు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం తరఫునే ఒక అధికారిక టికెటింగ్ పోర్టల్‌ను ప్రవేశపెడితే, అది ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా, సామాన్య ప్రేక్షకులకు కూడా భారీ ఉపశమనం కలిగిస్తుందని విశాల్ కోరారు. దేశవ్యాప్తంగా "ఒకే దేశం, ఒకే పన్ను" (GST) విధానం అమలులో ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం సినిమా టికెట్లపై అదనంగా లోకల్ బాడీ టాక్స్ విధిస్తున్నారని విశాల్ గుర్తుచేశారు.

దేశంలో రెండు రకాల పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, ఈ పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు ఇస్తున్న సబ్సిడీ మొత్తం చాలా తక్కువగా ఉందని, దానిని మరింత పెంచి, ప్రతి ఏటా చిన్న చిత్రాల నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను గత 9 ఏళ్లుగా ప్రతినిధుల ద్వారా పంపుతూనే ఉన్నాం. సినిమా రంగం నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి విజయ్ మాత్రమే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, చిత్ర పరిశ్రమకు ఒక కొత్త ఆశాకిరణంలా నిలవగలరని ఆశిస్తున్నానంటూ విశాల్ చేసిన పోస్టు వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+