కేంద్ర మాజీ మంత్రిని సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ: వారం రోజుల సస్పెన్స్‌కు తెర
Chhattisgarh CM: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజులకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడింది. కొత్త ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకుంది.
ఆయనే- విష్ణుదేవ్ సాయ్ (Vishnu Deo Sai). గిరిజన నేత. కేంద్ర మాజీ మంత్రి. రాయ్‌గఢ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీఏ- 1 కేబినెట్‌లో ఆయన సహాయమంత్రిగా పని చేశారు. గనులు, ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించారు.

ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల వైపు మొగ్గు చూపారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుంకురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన యూడీ మింజ్‌ను ఓడించారు. ఆయనకు 87,604 ఓట్లు పోల్ అయ్యాయి.
ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. గిరిజన నాయకుడు, వివాదరహితుడు కావడం వల్ల ఆయన అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపింది. విష్ణుదేవ్ సాయి పేరును అధికారికంగా ప్రకటించనుంది.
కాగా- ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భూపేష్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మట్టికరిచింది. బీజేపీ ఇక్కడ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకే పరిమితమైంది.












Click it and Unblock the Notifications