15 రోజులు పెరోల్ కోసం శశికళ ప్రయత్నాలు, క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి, కష్టం !
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ తన భర్త నటరాజన్ ను చూసుకోవడానికి 15 రోజులు పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో నటరాజన్ చికిత్స పొందుతున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త నటరాజన్ కు ఆపరేషన్ చేసి అవయవ మార్పిడి చేస్తున్నారని, ఆయన్ను చూసుకోవడానికి పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. శశికళకు కచ్చితంగా పెరోల్ వస్తుందని ఆమె వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శశికళకు పెరోల్ రావడం చాల అకష్టం అంటున్నారు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు. శశికళ మీద అనేక క్రిమినల్ కేసులు విచారణలో పెండింగ్ లో ఉన్నాయని, ఇలాంటి సమయంలో శశికళకు పెరోల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా పెరోల్ మీద బయటకు వెళ్లాలని శశికళ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications