Sasikala: చిన్నమ్మ ఫ్యామిలీలో ఆందోళన, ఐసీయూలో శశికళ సొంత తమ్ముడు, ఒక్కసారికూడా ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తరువాత చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సినిమా కష్టాలు ఎదురైనాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆమె ప్రాణాలతో ఉన్న సమయంలో వీకే శశికళ కుటుంబ సభ్యులు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పారు. జయలలిత మరణించిన తరువాత శశికళ జైలుపాలైయ్యింది. తరువాత శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టడంతో మన్నార్ గుడి ఫ్యామిలీ (శశికళ ఫ్యామిలీ) చిలీపోయింది. శశికళ నటరాజ్ సొంత సోదరుడు దివాకరన్ ఇప్పుడు కరోనా వైరస్ కు గురికావడంతో చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైయ్యింది. చెన్నైలోని ప్రేవేటు ఆసుపత్రిలో దివాకరన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
Recommended Video
Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!

అమ్మ జయలలిత టైమ్ లో హవా
అమ్మ జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్ కుటుంబ సభ్యులు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పారు. అప్పట్లో అన్నాడీఎంకే పార్టీలో కూడా శశికళ కుటుంబ సభ్యులు చెప్పిందే వేదంగా తయారైయ్యింది. శశికళ కుటుంబ సభ్యులు అన్నాడీఎంకే పార్టీ మీద పెత్తనం చెలాయించే సమయంలో వారిని మన్నార్ గుడి ఫ్యామిలీ అని పిలిచేవాళ్లు.

చీలిపోయిన మన్నార్ గుడి ఫ్యామిలీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తరువాత చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సినిమా కష్టాలు ఎదురైనాయి. జయలలిత మరణించిన తరువాత శశికళ జైలుపాలైయ్యింది. తరువాత శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టడంతో మన్నార్ గుడి ఫ్యామిలీ చిలీపోయింది. ఇప్పుడు ఎవరిదారివాళ్లదే అన్నట్లు ప్రవర్థిస్తున్నారని తమిళనాడు ప్రజలు అంటున్నారు.

చిన్నమ్మ తమ్ముడికి అనారోగ్యం
టీటీవీ దినకరన్ పార్టీ పెట్టిన తరువాత అతని మేనత్త వీకే. శశికళ ఎలా చెబితే అలా నడుచుకున్నాడు. ఈ విషయం జీర్ణించుకోలేని శశికళ సొంత సోదరుడు దివాకరన్ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఇదే విషయంలో దివాకరన్ సొంత అక్క శశికళకు దూరం అయ్యాడు. తమిళనాడులోని తిరువళ్లూరులోని సుందరకోటైలో నివాసం ఉంటున్న దివాకరన్ అనారోగ్యానికి గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ఐసీయూలో దివాకరన్
తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దివాకరన్ కు ప్రథమ చికిత్స అందించారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న దివాకరన్ కు ఒక్కసారిగా గొంతు నొప్పి, శ్వాసకోస సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబులెన్స్ లో దివాకరన్ ను చెన్నైలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. దివాకరన్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పోందుతున్నాడు. జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన వీకే. శశికళను కుటుంబ గొడవల కారణంగా ఇంతవరకు దివాకరన్ ఒక్కసారి కూడా ఆమెను కలవలేదు.