మొదలైన జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రెండో దశ పోలింగ్, బరిలో 55 మంది కోటీశ్వరులు

40 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రులు మధుకోడా, అర్జున్ ముండాలాంటి నేతలు నేటి బరిలో ఉన్నారు. మొత్తంమ్మీద 223 మంది అభ్యర్థులు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే, ఉగ్రవాద శక్తుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఉప సభాపతి, నలుగురు మంత్రులు, 11 మంది ప్రస్తుత శాసనసభ్యులు బరిలో ఉన్నారు. రెండో దశలో మొత్తం 18 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
జమ్మూ కాశ్మీర్‌లోమొత్తం 275 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా వారిలో 55 మంది కోటీశ్వరులు ఉన్నారు. తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో తొమ్మిది మంది అక్షరం ముక్క రాని నిరక్షరాస్యులు. 11 మంది తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని ప్రకటించారు.
.












Click it and Unblock the Notifications