అగస్టా స్కాం: ఐఏఎఫ్ మాజీ చీఫ్ త్యాగి, వ్యాపారవేత్త ఖైతాన్ అరెస్ట్
ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీని సీబీఐ శుక్రవారం నాడు అరెస్టు చేసింది. సంచలనం రేపిన అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ స్కాంలో త్యాగి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ చీఫ్ ఎస్పీ త్యాగీని సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) శుక్రవారం నాడు అరెస్టు చేసింది. సంచలనం రేపిన అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ స్కాంలో త్యాగి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
త్యాగితో సహా మరో ఇద్దరిని సిబిఐ అరెస్టు చేసింది. గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగిలను కూడా అరెస్టు చేసింది. గౌతమ్ ఖైతాన్ ప్రముఖ వ్యాపారవేత్త.

కాగా, గత యూపీఏ ప్రభుత్వం రూ.3,600 కోట్లతో విదేశాల నుంచి అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీకి చెందిన పన్నెండు వీవీఐపీ చాపర్ హెలికాప్టర్లు కొనుగోలు చేసింది. ఈ వ్యహారంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని సీబీఐ అభియోగం మోపింది.
అప్పటి వైమానిక దళపతి త్యాగి ముడుపుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొంది. బిడ్గింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా త్యాగి సహకరించారని, అగస్టా మధ్య వర్తులతో ఆయన సోదరులకు పరిచయాలున్నాయని ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications