Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

Lok Sabha elections 2024: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ముమ్మరంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.

ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. జోరుగా సాగుతోంది.

VVPAT issue Supreme Court rejects the petitioners to return to ballot paper voting

ఈ పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రెండు వేర్వేరు ఆదేశాలను జారీ చేసింది. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ప్రింట్ అయ్యే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్.. (VVPAT)కు సంబంధించిన పిటీషన్లపై విచారణ నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలను ఇచ్చింది.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రతినిధులు, ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ వేర్వేరుగా ఈ పిటీషన్లు వేశారు. ఇప్పుడు కొనసాగుతున్న వీవీప్యాట్ లెక్కింపు ప్రక్రియలో మార్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేయాలని వారు అభ్యర్థించారు.

ప్రతి ఈవీఎంలో కూడా ర్యాండమ్‌గా తీసిన అయిదు వీవీప్యాట్ స్లిప్పులకు బదులుగా- అన్నింటినీ లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలా సాధ్యం కాకపోతే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించేలా ఆదేశాలను జారీ చేయాలని వారు కోరారు. ఈ పిటీషన్లపై బుధవారమే విచారణను ముగించింది సుప్రీంకోర్టు. తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి కిందటే తన తుది ఆదేశాలను జారీ చేసింది.

VVPAT issue Supreme Court rejects the petitioners to return to ballot paper voting

బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించాలనే పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ పిటీషనర్లు చేసిన విజ్ఞప్తిపైనా స్పందించింది. దీనిపై రెండు వేర్వేరు ఆదేశాలను జారీ చేసింది బెంచ్.

ఒకటి- ఎన్నికల గుర్తు లోడింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఈవీఎంలో ఉండే సింబల్ లోడింగ్ యూనిట్‌ను కూడా సీల్ వేయాలి. ఇందులో ఉండే వివరాలు, ఇతర సమాచారాన్ని కనీసం 45 రోజుల పాటు నిల్వ ఉంచాలి.

రెండు- ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తరువాత ప్రొఫెషనల్ ఇంజినీర్లతో కలిసి ఈవీఎంలల్లో ఉండే మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేసే అధికారాన్ని సదరు అభ్యర్థికి కల్పించాలి. అధికారికంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించిన ఏడు రోజుల వరకు అభ్యర్థికి ఈ అవకాశం ఉండేలా చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+