అమానుషం.. ఎంగిలి ప్లేట్లు తగిలాయని కొట్టి చంపేశారు...
సాధారణంగా పెళ్లిలో హాడావిడి ఎక్కువే ఉంటుంది. బంధువులు అటు ఇటు తిరగడం, పెళ్లి భోజనాల్లో వడ్డించేవారు, పనివారు అంతా కాస్త పెళ్లి పనుల్లో బిజిగా ఉంటారు. ఇక పెళ్లిల్లో ఎక్కువగా పని ఉండేది వెయిటర్లకే.. వచ్చే అతిథులకు వడ్డించడం, ఆ ప్లేట్లని తీసేయడం పనులన్నీ ఉంటాయి.
ఈ బిజిలో వారి వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అటువంటి వాటిని చూసి చూడనట్లు పోవాలే కానీ, దానికే వెయిటర్లతో గొడవపడ్డం, వారిని కొట్టడం వంటివి చేస్తుంటారు చాలామంది. కానీ, ఈ పెళ్లిలో మాత్రం వెయిటర్ చేసిన చిన్న తప్పుకి ఏకంగా అతన్ని చంపేశారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

పెళ్లిలో ఎంగిలి ప్లేట్లను శుభ్రం చేసేందుకు తీసుకెళ్తుండగా అవి కాస్తా అతిథులకు తాకాయని ఏకంగా ఆ వెయిటర్‌నే కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత నెల 17న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంకుర్ విహార్ సీజీఎస్ వాటికలో పంకజ్ అనే ఓ వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు.
అయితే, పెళ్లిలో తిన్న ఎంగిలి ప్లేట్లను శుభ్రం చేసేందుకు పంకజ్ తీసుకెళ్తుండగా అవి కాస్తా రిషభ్ అనే వ్యక్తితో పాటు అతడి ఇద్దరు స్నేహితులకు తగిలాయి. తిన్న ప్లేట్లను మాకే తాకిస్తావా అన్న కోపంతో వారు ముగ్గురూ తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. కోపంతో రగిలిపోయిన రిషబ్ అతడి స్నేహితులైన మనోజ్, అమిత్ కలిసి పంకజ్‌ను అక్కడే దారుణంగా కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన అక్కడిక్కడే మృతిచెందాడు.
ముగ్గురు నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు..
పంకజ్ డెడ్‌బాడీని చూసిన ఆ ముగ్గురు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలీక ఆందోళన చెందారు. తర్వాత ఏమౌతుందో నన్న భయంతో రిషభ్, అతడి స్నేహితులు కలిసి పంకజ్ మృతదేహాన్నిసమీపంలో ఉన్న ఓ అడవిలో దాచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మరుసటి రోజు బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుకున్న నిందితులు పోలీసులు బారిన పడకుండా తప్పించుకు తిరిగారు. అయితే, తాజాగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications