సురేష్ గోపి షాకింగ్ కామెంట్స్, వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుడతానని
కేరళ సూపర్ స్టార్, బిజెపి రాజ్యసభ సభ్యులు సురేశ్ గోపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జంద్యం (యజ్ఞోపవేతం) ధరించే వారందరనీ దేవుళ్లుగా పరిగణించాలన్నారు.
తిరువనంతపురం: కేరళ సూపర్ స్టార్, బిజెపి రాజ్యసభ సభ్యులు సురేశ్ గోపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జంద్యం (యజ్ఞోపవేతం) ధరించే వారందరనీ దేవుళ్లుగా పరిగణించాలన్నారు.
తనకు పునర్జన్మపై నమ్మకం ఉందని, వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి శబరిమల ఆలయ ప్రధాన పూజారిని అవుతానని పేర్కొన్నారు.
తిరువనంతపురంలో బ్రాహ్మణులు నిర్వహించిన యోగక్షేమ సభకు హాజరైన సురేశ్ గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

'పునర్జన్మపై నాకు విశ్వాసం ఉంది. వచ్చే జన్మలో జంద్యం ధరించే కులంలో పుడతా. శబరిమల ప్రధాన పూజారిని అవుతా' అని సురేశ్ గోపీ పేర్కొన్నారు.
కాగా, సురేశ్ గోపీ వ్యాఖ్యలపై నిరసనలు ఆయన సినిమాలోని డైలాగ్‌ను ఉదహరిస్తూ విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలోను దుమారం రేగుతోంది.
కాగా, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ప్రజాస్వామ్య భారత దేశంలో ఇతరులను కించపరచకండా, తన అభిప్రాయం చెప్పవచ్చుననే వాళ్లూ లేకపోలేదు. అదే సురేష్ గోపి చెప్పారంటున్నారు.












Click it and Unblock the Notifications