తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొడతారో చెప్తే: ప్రకాశ్ రాజ్ వ్యంగ్యం
తాజ్ మహల్‌పై ఇటీవల వివిధ రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
చెన్నై: తాజ్ మహల్‌పై ఇటీవల వివిధ రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలు పెట్టారని, ఇంతకీ, తాజ్ మహల్‌ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్‌ను చూపిస్తానని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ప్రశ్నించడం కొనసాగిస్తానని, ఇది తన ప్రాథమిక హక్కు అని, తాను వ్యక్తపరిచిన భావాలను విభేదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, తనపై ఎవరైతే అదేపనిగా విమర్శలు చేస్తారో వారి పదజాలం చాలా అసహ్యం కల్గిస్తోందని, మీరు చేసే ప్రతి దూషణ కారణంగా తన భావాలను మరింత దృఢంగా చెప్పే శక్తినిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications