బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Puneeth Rajkumar: లైట్..కెమెరా..యాక్షన్: శివణ్ణ హీరోగా డైరెక్షన్: తీరని కోరిక అదే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా వెలుగొందుతోన్న పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి ఆదివారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. లక్షలాది మంది అభిమానుల చివరి చూపు కోసం ఆయన పార్థిక దేహాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు.

పోలింగ్ కోలాహలం: బద్వేలు, హుజూరాబాద్‌ సహా 30 చోట్ల: ఆ లోక్‌సభ సీట్లల్లోపోలింగ్ కోలాహలం: బద్వేలు, హుజూరాబాద్‌ సహా 30 చోట్ల: ఆ లోక్‌సభ సీట్లల్లో

పోటెత్తిన కంఠీరవ..

పోటెత్తిన కంఠీరవ..

ఆయన తుదిశ్వాస విడిచిన విక్రమ్ ఆసుపత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం పార్థివదేహాన్ని సదాశివ నగరలోని ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల చివరి చూపు అనంతరం సాయంత్రం 5 గంటలకు కంఠీరవ స్టేడియానికి తరలించారు. శనివారం సాయంత్రం నుంచి ఏకధాటిగా లక్షలాది మంది అభిమానులు తమ ఆరాధించే హీరోకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము అనే తేడా లేదు. వర్షం కురిసినప్పటికీ లెక్క చేయలేదు. కడసారి చూపు కోసం లక్షలాదిగా తరలి వస్తోన్నారు.

 అభిమానుల అకాలమృతి

అభిమానుల అకాలమృతి

స్టార్ హీరోగా తన కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణానికి గురి కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు అభిమానులు ప్రాణాలు వదిలారు. చామరాజనగర జిల్లా మరూర్ గ్రామానికి చెందిన మునియప్ప అనే 30 సంవత్సరాల అభిమాని ఒకరు గుండెపోటుతో మరణించారు. చిన్నప్పటి నుంచీ అతను పునీత్ రాజ్‌కుమార్ అభిమాని. పునీత్ మరణవార్తలను టీవీలో చూస్తూ గుండెపోటుకు గురయ్యాడు. మరొకరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మెగా ఫోన్ పట్టుకోవాలనేది..

మెగా ఫోన్ పట్టుకోవాలనేది..

కాగా- మెగా ఫోన్ పట్టుకోవాలనేది పునీత్ రాజ్‌కుమార్ కోరిక. ఎప్పటికైనా దర్శకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది తీరని కోరకగానే మిగిలి పోయింది. తన అన్న, శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ హీరోగా నటించే సినిమాకు దర్శకత్వం చేయాలనేది ఆయన కల. రెండు వారాల కిందట ఈ విషయాన్ని పునీత్ రాజ్‌కుమార్ స్వయంగా వెల్లడించాడు. కన్నడ మాస్ హీరో దునియా విజయ్ నటించిన సలగ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన సందర్భంగా ఈ దర్శకత్వ కోరికను బయట పెట్టారు.

శివ రాజ్‌కుమార్ హీరోగా..

శివ రాజ్‌కుమార్ హీరోగా..

ఈ ఫంక్షన్‌‌కు శివ రాజ్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. తన కేరీర్‌లో ఎప్పటికైనా మెటా ఫోన్ పట్టుకుంటానని, డైరెక్టర్ సీట్‌లో కూర్చుని లైట్, కెమెరా, యాక్షన్.. అని చెప్పాలనేది తన లక్ష్యమని చెప్పారు. అందులో శివణ్ణ (శివ రాజ్‌కుమార్) అఅకతప్ప మరొకరిని హీరోగా ఊహించుకోలేననీ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఎవరూ చూడని శివణ్ణను కన్నడ ప్రేక్షకులకు పరిచయం చేస్తానని అన్నారు. ఓ తమ్ముడిగా ఆయనను అన్ని విధాలుగా హీరోగా చూపించే కెపాసిటీ తనకు ఉందని చెప్పారు.

Recommended Video

Powerstar Puneeth Rajkumar life story | Oneindia Telugu
ఓం మూవీలను డైలాగ్స్..

ఓం మూవీలను డైలాగ్స్..

అక్కడే ఉన్న శివ రాజ్‌కుమార్ దీనికి స్పందించారు. తన తమ్ముడిని వెయిట్ చేయించడం తనకు ఇష్టం లేదని చెప్పడంతో.. అక్కడికక్కడే ఓ సీన్‌ను డైరెక్ట్ చేయించారు. పునీత్ లైట్, కెమెరా, యాక్షన్ చెప్పడంతో.. శివ రాజ్‌కుమార్ స్టేజీ మీదే నటించారు. ఓం సినిమాలోని కొన్ని పవర్‌ఫుల్ డైలాగులను పలికారు. డైలాగ్ ముగియగానే పునీత్ రాజ్‌కుమార్ కట్ చెప్పారు. ఆయన హఠాన్మరణంతో దర్శకత్వం చేయాలనేది తీరని కోరికగా మిగిలింది.

English summary
Wanted to direct Shiva Rajkumar: This was Puneeth Rajkumar's last wish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X