అమాయక ముస్లింలను మిస్ లీడ్ చేస్తోన్నారు- కేంద్రమంత్రి
Waqf Bill: దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు ఇంకాస్సేపట్లో పార్లమెంట్ సమక్షానికి రాబోతోంది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టబోతోన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్- వాటి మిత్రపక్షాలు విప్ సైతం జారీ చేశాయి. టీడీపీ కూడా విప్ ఇచ్చింది. ఈ బిల్లుకు జనసేన మద్దతు తెలిపింది.
వక్ఫ్ బిల్లు గతంలో పార్లమెంట్ సమక్షానికి వచ్చినప్పటికీ- అది ఆమోదం పొందలేదు. అందులో సవరణలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జగదంబికా పాల్ దీనికి సారథ్యాన్ని వహించారు.

ఈ 31 మందిలో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, డీకే అరుణ, ఏపీ నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, విజయసాయి రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు 284 మందితో చర్చలు జరిపింది.
ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశమైంది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ముస్లిం మత పెద్దలతో భేటీ అయింది. అలాగే- మూడుసార్లు స్టడీ టూర్లనూ నిర్వహించింది. ఆయా రాష్ట్రాల వక్స్ బోర్డులు, ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్ ఛైర్మన్లతో మాట్లాడింది.
ఇప్పటివరకు ఈ జేపీసీ 38 సార్లు సమావేశమైంది. వక్స్ హెూదా, జిల్లా కలెక్టర్‌కు అధికారాలను అప్పగించడం, వక్స్ బోర్డు నిర్మాణం, ట్రిబ్యునల్ అధికారాలను కల్పించడం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. జేపీసీకి 44 సవరణలు సైతం అందాయి. వాటిలో 14 సవరణలకు జేపీసీ ఆమోదం లభించింది.
దీనిపై తాజాగా కిరణ్ రిజిజు మాట్లాడారు. వక్ఫ్ బిల్లుపై ఎలాంటి అపోహలు అక్కర్లేదని అన్నారు. కొంతమంది మత పెద్దలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు.. ఈ బిల్లుపై అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో సీఏఏపై ముస్లింలకు ఎలాంటి భయాందోళనలను కలిగించారో.. ఇప్పుడు కూడా అలాంటి చర్యలకే పాల్పడుతున్నారని అన్నారు.
సీఏఏ వల్ల ముస్లింల పౌరసత్వానికి ఎలాంటి ముప్పు రాలేదని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని హామీ ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ బిల్లు అవసరమంటూ ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారని పేర్కొన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాళ్లంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications