చైనాకు బెదరం, త్వరలో మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ?
న్యూఢిల్లీ: చైనాతో యుద్దం వస్తే సాధించేదేమీ ఉండదని ఇండియా అంచనా వేస్తోంది. రెండు దేశాల మధ్య డోక్లామ్ వద్ద సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో చైనా, ఇండియాల మధ్య మాటల యుద్దం సాగుతోంది.
డోక్లామ్ వద్ద చైనా, ఇండియాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాన్ని పురస్కరించుకొని రెండు దేశాల సైనికులు బాహబాహీకి కూడ దిగారు.
ఆగష్టు 15వ, తేదిన రెండు దేశాల సైనికులు పరస్పరం రాళ్ళ దాడి చేసుకొన్నారు. ఈ సరిహద్దు ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనా సరిహద్దు వెంట భారత్ భారీగా తన సైన్యాన్ని మోహరించింది.
సుమారు 1400 కి.మీ. పొడవున ఉన్న చైనా సరిహద్దు వెంట భారత్ సైన్యాన్ని మోహరించడంతో చైనా కూడ అప్రమత్తమైంది.అంతేకాదు భారత్‌తో సరిహద్దు వెంట చైనా కూడ తన సైన్యాన్ని మోహరించింది.
చైనా మీడియా కూడ భారత్‌పై విద్వేషపూరితంగా కథనాలను ప్రసారం చేస్తోంది. డోక్లామ్ వద్ద భారత్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా మీడియాతో సహ, కొందరు అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రాణ నష్టం మినహ సాధించేదేమీ లేదు
చైనాతో యుద్దం చేస్తే పెద్దగా ఒరిగేదేమీలేదని ఇండియా అభిప్రాయపడుతోంది. చైనాకు కూడ పెద్దగా ప్రయోజనం ఉండదని కూడ ఇండియా అభిప్రాయంతో ఉంది. ఇరువైపులా ప్రాణ నష్టం మినహ మరోకటి సాధించలేదని ప్రభుత్వం అంచనగా ఉంది.చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఇండియా కోరుతోంది.
Recommended Video


చైనా హెచ్చరికలకు బెదరం
1962లోనే చైనాతో ఇండియా యుద్దం చేసింది. అలాంటిది తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఏసవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలను పంపింది.ఆసియా ఖండంలో చైనా ప్రబలశక్తిగా ఎదిగింది.అమెరికాకు ధీటుగా ఉన్న చైనా యుద్దం చేస్తే ఆ దేశానికే సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా అంచనావేస్తోంది.

సైన్యంలో ఇండియా టాప్, మౌళిక వసతుల్లో చైనా టాప్
డోక్లామ్ వద్ద భారత్‌కే ప్రాబల్యం ఉందని, సైన్యం విషయంలో ఇండియా టాప్ ఉందని భారత్ ఆర్మీ అధికారులు అంచనావేస్తున్నారు. మౌళిక వసతుల విషయంలో చైనా ముందుందనే విషయాన్ని ఇండియా అధికారులు గుర్తించారు. యుద్దం వస్తే 3488 కి.మీ. ఇండో చైనా సరిహద్దు వెలుపలకు కూడ విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది ఇండియా.

సెప్టెంబర్‌లో మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ
భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఊపందుకొన్న తరుణంలో ఉద్రిక్తతలు యుద్దానికి దారితీసే పరిస్థితి ఉండబోదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్దం దిశగా సాగుతున్న చైనా దూకుడును ఆర్థిక, వ్యూహత్మక అంశాలు బ్రేక్ వేస్తాయని చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ తొలి వారంలో చైనాలో బ్రిక్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరదించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications