వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వాల్ని కూల్చమన్నారు, అందుకే తొలగించారు: ఖురేషీ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

భోపాల్: అజీజ్ ఖురేషీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్లుగా పని చేస్తున్నప్పుడు హరీష్ రావత్, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాలను కూల్చాలంటూ తనకు పరోక్షంగా సంకేతాలు వచ్చాయని బాంబు పేల్చారు. ఐతే, ఆ సంకేతాలు పంపిన వారి పేర్లు వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు.
ఆ పేర్ల తగిన సమయంలో బయటపెడతానని చెప్పారు.

ఇటీవల మిజోరం గవర్నర్ పదవి నుంచి తొలగించబడిన ఖురేషీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను 2012 మే నుంచి 2014 డిసెంబర్ దాకా ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు హరీష్ రావత్ ప్రభుత్వాన్ని కూల్చమని తనను కోరారని, ఆ తర్వాత తాను ఉత్తరప్రదేశ్‌కు తాత్కాలిక గవర్నర్‌గా ఉన్నప్పుడు అఖిలేష్ ప్రభుత్వాన్ని దించేయాలని ఫీలర్స్ ద్వారా కోరారని చెప్పారు.

అలా చేసినట్లయితే ఆ పని చేసినందుకు బదులుగా తనను పూర్తికాలం గవర్నర్ పదవిలో కొనసాగిస్తామని, అంతేకాదు మరోసారి గవర్నర్ పదవిలో కొనసాగిస్తామని చెప్పారని, అయితే నిజాయితీగా పని చేయడానికి తాను ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. తాను ఎప్పుడూ ఎవరి పట్ల వివక్ష చూపలేదన్నారు.

Was Asked to Topple Uttarakhand, UP Govts: Aziz Qureshi

తాను ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ పేరిట మైనార్టీ యూనివర్సిటీని ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదముద్ర వేసినప్పుడు తనను కలిసి తమ అసంతృప్తి తెలియజేశారన్నారు. యూపీ అడ్వకేట్ జనరల్ సహా పలువురు న్యాయ కోవిదులను సంప్రదించిన తర్వాతే తాను దానికి ఆమోదముద్ర వేసానన్నారు.

అయితే ఆ తర్వాత తాను మతతత్వవాదినని కొంతమంది విమర్శించారన్నారు. తాను యూపీ గవర్నర్‌గా ఉన్నప్పుడు అత్యాచారాల పైన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేయమని అప్పటి హోం కార్యదర్శి అనిల్ గోస్వామి తనను కోరారని, అయితే తానను రాజీనామా చేయమని కోరాల్సిన వ్యక్తి మీరు కాదని, ప్రధానమంత్రో, హోంమంత్రి మాత్రమే ఆ విషయం మాట్లాడాలని తాను చెప్పానన్నారు.

మొత్తం పోలీసు వ్యవస్థను రంగంలోకి దించినా అత్యాచారాలను పూర్తిగా ఆపలేరని, ఆ దేవుడొక్కడే వాటిని ఆపాలంటూ ఖురేషీ నాడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సంప్రదాయానికి భిన్నంగా తనను మిజోరం గవర్నర్ పదవి నుంచి తప్పించారని, గతంలో ఎన్నడు కూడా అలా జరగలేదన్నారు. తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అప్పటికే సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసిన సమయంలో తనను తొలగించడం జరిగిందన్నారు.

English summary
Aziz Qureshi who was recently removed as Governor of Mizoram, has claimed that he received "feelers" to topple the Harish Rawat and Akhilesh Yadav governments of Uttarakhand and Uttar Pradesh respectively when he was serving as the Governor in these states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X