వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారుఖ్‌ను ప్రశ్నించిన ఈడీ: నిలదీసిన కాంగ్రెస్ నేత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోడీ పాలనలో పెరిగిపోతున్న మత అసహనంపై మాట్లాడినందుకే షారుఖ్‌ను ఈడీ టార్గెట్‌ చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సురెజ్ వాలా ట్విట్టర్‌లో మండిపడ్డారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్‌ఎస్‌పీఎల్) షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి అమ్మడంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో షారూఖ్ ఖాన్‌ను మంగళవారం ఈడీ మూడు గంటలపాటు ప్రశ్నించింది.

Was Shah Rukh questioned by ED for speaking on intolerance, asks Congress

ఈ మేరకు "దీపావళి రోజు షారుఖ్ ను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారా? లేక మనసులో ఉన్నది ఆయన మాట్లాడారని టార్గెట్ చేశారా? ప్రభుత్వం ప్రతీకార చర్యలకు ఈడీ కొత్త ఆయుధంగా మారిందా?" అని రణదీప్ ట్విట్టర్ లో సూటిగా ప్రశ్నించారు.


హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పట్ల కూడా ఈడీ అనుచితంగా ప్రవర్తించిందని ఆయన ఆరోపించారు. వీరభద్ర సింగ్ కుమార్తె వివాహం జరిగిన రెండోరోజే ఆయన నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు సోదాలు చేయడంపై ఆయన తప్పుబట్టారు.

English summary
The Congress on Thursday questioned if Shah Rukh Khan had faced the wrath of Enforcement Directorate (ED) because he spoke up on the issue of intolerance.On Wednesday, the ED had questioned Khan over alleged violations of the Foreign Exchange Management Act (FEMA) in the Indian Premier League (IPL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X