viral video:మెట్రోలో యువతి ఫైర్, యువకుడి చెంప చెల్, కారణమిదే..? వైరల్

లవర్స్ మధ్య గొడవలు సహాజమే.. పెళ్లయిన తర్వాత కూడా కామనే.. కానీ బహిరంగంగా గొడవ జరిగితే ఇక అంతే.. ఇప్పుడు నాలుగో కన్ను.. అదేలేండీ.. కెమెరాలు ఉన్నందున.. వీడియోలు తీయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. అలాంటి చాలా వీడియోలు రోజు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలో కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ యువతి.. యువకుడి చెంపచెల్‌మనిపించింది. కారణం ఏంటో మీరే తెలుసుకొండి.

వీడియోలో ఇలా

వీడియోలో ఇలా


ఢిల్లీ మెట్రోలో కొందరు ప్రయాణిస్తున్నారు. ఓ యువతి, యువకుడు అక్కడే ఉన్నారు. అయితే వారికి అప్పటికే గొడవ జరిగింది. అదే డ్రెస్ విషయమే.. కానీ ఆ గొడవను చూసిన కార్తీక్ అనే వ్యక్తి వీడియో తీశాడు. దానికి అతను ఢిల్లీ మెట్రో ఎంటర్‌టైన్ మెంట్ అని రాశారు. 49 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.

టీ షర్ట్ విషయమే గొడవ

టీ షర్ట్ విషయమే గొడవ


జర షాపింగ్‌లో వారు టీ షర్ట్ కొనుగోలు చేశారు. అదీ రూ.1000 పడింది. దానిపై ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది. అదీ కాస్ట్ పడిందని గొడవ.. రూ.150కి టీ షర్ట్ వస్తుండే అనడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. దీంతో యువతి కోపం ఆపుకోలేకపోయింది. అతని చెంపచెల్‌మనిపించింది. చాలా సార్లు కొట్టడంతో అతను కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. స్టేషన్ దిగుతూ కూడా వారిద్దరూ ఘర్షణకు దిగారు. వీడియోపై నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

కత్రినా, సుష్మిత కూడా

కత్రినా, సుష్మిత కూడా


హాహాహా అంటూ ఒక నెటిజన్ రాశారు. దీనినే వైల్డ్ లవ్ అంటారని మరొకరు రాశారు. ఢిల్లీ మెట్రోలో పూర్తి వినోదం.. అని మరొకరు రాశారు. కత్రినా కైఫ్, సుస్మితా సేన్, లలిత్ మోడీ కూడా ఇలాంటివి ఇవ్వలేరు అని మరొకరు రాశారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒకవిధంగా రాశారు. ఆ యువతికి మాత్రం చిర్రెత్తుకు వచ్చింది. అందుకే అలా బిహెవ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+