పాత పార్లమెంట్‌కు వీడ్కోలు: కోటి ఆశలతో కొత్త భవనంలోకి..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన సముదాయం మనుగడలోకి వచ్చింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కొద్దిసేపటి కిందటే కొత్త పార్లమెంట్ భవనంలో లాంఛనంగా అడుగుపెట్టారు.
పాత పార్లమెంట్‌లో కేంద్రం వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటుచేసింది. సెంట్రల్ హాల్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గే.. వేదికపై ఆసీనులయ్యారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. పాత పార్లమెంట్ భవనంలో తమ ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన కీలక బిల్లుల గురించి ప్రస్తావించారు. ఈ పార్లమెంట్‌లో నిర్వహించిన సమావేశాల్లో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ముస్లిం మహిళలకు న్యాయం చేశామని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం ఇక్కడే ఆమోదం పొందిందని గుర్తు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసుకోగలిగామని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లకు న్యాయం చేయడానికి, దివ్యాంగులకు బంగారంలాంటి భవిష్యత్తుకు భరోసానిచ్చే చట్టాలను పాత పార్లమెంట్ సమావేశంలో ఆమోదింపజేసుకున్నామని వ్యాఖ్యానించారు.

మోదీ ప్రసంగం ముగిసిన తరువాత జగ్‌దీప్ ధన్‌కర్ మాట్లాడారు. పాత భవనానికి వీడ్కోలు పలికే అత్యంత అరుదైన, చారిత్రాత్మక సంఘటనలో తామందరం భాగస్వామ్యులం అయ్యామని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం, భారత్ మండపం, యశోభూమి.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన కళాఖండాలుగా చరిత్రలో మిగిలిపోతాయని అన్నారు.
జగ్‌దీప్ ధన్‌కర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ్యులందరూ కొత్త భవనం వైపు అడుగులు వేశారు. నడుచుకుంటూ అందులోకి వెళ్లారు. పాత పార్లమెంట్ భవనానికి ఆనుకునే సెంట్రల్ విస్టా పేరుతో దీన్ని నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. జట్లు, జట్లుగా వెళ్లడం కనిపించింది. ఆ సమయంలో వారంతా నినాదాలు చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Union Ministers Piyush Goyal, Nitin Gadkari and other parliamentarians enter the New Parliament building. pic.twitter.com/kis6atj56K
— ANI (@ANI) September 19, 2023
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయెల్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి.. ఇలా కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులందరూ ఒక జట్టుగా కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు. మహిళా సభ్యులందరూ మరో జట్టుగా బయలుదేరి వెళ్లడం కనిపించింది.
#WATCH | Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, MPs Rahul Gandhi, Gaurav Gogoi and others enter the new building of the Parliament. pic.twitter.com/nFhM8BT3Eg
— ANI (@ANI) September 19, 2023
ఇక కాంగ్రెస్ సభ్యులందరూ మరో జట్టు కట్టారు. రాహుల్ గాంధీతో కలిసి వారంతా కొత్త పార్లమెంట్ వైపు సాగిపోయారు. లోనికి అడుగుపెట్టడానికి ముందు వారంతా కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం వద్ద గ్రూప్ ఫొటో దిగారు. ఈ సమయంలో అధిర్ రంజన్ చౌదరి.. రాజ్యాంగ ప్రతిని ప్రదర్శించారు.
#WATCH | Delhi | Women invitees arrive at the new Parliament building. pic.twitter.com/IqM9164kGR
— ANI (@ANI) September 19, 2023












Click it and Unblock the Notifications