పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ.. గుండెపోటుతో కన్నుమూసిన వరుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుజరాత్‌: ఆనందంగా సాగుతున్న వివాహ వేడుకలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో నృత్యం చేస్తున్న పెళ్లికొడుకు(25) గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

గుజరాత్‌ వడోదర లోని బోర్సాడ్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు సాగర్‌ సోలంకీ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు.

groom-dance-death

తన స్నేహితుడి భుజాలపై కూర్చుని చేతులెత్తి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ వూరేగుతున్నాడు. ఇంతలో ఒక్కసారి గుండెపోటుకు గురై స్నేహితుడి భుజంపైనే కుప్పకూలిపోయాడు. ఊరేగింపులో ఉన్న వారికి ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు.

జరిగింది అర్థమవగానే వారు వెంటనే పెళ్లికొడుకును స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారని సాగర్‌ తండ్రి రాజేశ్‌ తెలిపారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A wedding event turned into tragedy after a 25-year-old groom died of a heart attack during the procession to the venue in Borsad town of Gujarat.According to news agency PTI, as the wedding procession was proceeding on Tuesday night for the bride’s home with the family members dancing in a joyous mood in Borsad, about 60 km from here, the groom, Sagar Solanki, who was sitting on a friend’s shoulders, suddenly collapsed. Solanki was declared dead after being rushed to the hospital. Visuals show Solanki on his friend’s shoulders and later collapsing while performing a dance move.
Please Wait while comments are loading...