వాయు కాలుష్యానికి రైతులా కారణం ?, పరిష్కారం ఉంది, హోమం చెయ్యండి, బీజేపీ మంత్రి!

లక్నో: వాయు కాలష్యానికి పరిష్కారం ఉందని ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత సునీల్ భరలా అన్నారు. రైతులు వ్యర్థపదార్థాలను బూడిద చెయ్యడం వలన పొగ, వాయు కాలుష్యం వస్తోందని అనేక రాష్ట్రాలు ఆరోపించడం చాలా తప్పు, దానికి పరిహారంగా దేవుడిని పూజించాలని, హోమాలు, యాగాలు చేస్తే రాష్ట్రంలోని అనేక రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి పరిహారం ఉంటుందని, ఢిల్లీ కాలుష్యానికి పరిష్కారం చిక్కుతుందని ఉత్తరప్రదేశ్ మంత్రి సునీల్ భరలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంద్రుడిని పూజించి హోమం చేస్తే ఢిల్లీ కాలుష్యానికి ఓ చక్కటి పరిష్కారం చిక్కుతుందని, అక్కడి ప్రజలు ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా క్షేమంగా ఉంటారని బీజేపీ నాయకుడు, ఉత్దరప్రదేశ్ మంత్రి సునీల్ భరలా అన్నారు.

Watch this Uttar Pradesh Minister suggests to perform special Yagna to tackle Air Pollution

నేటి పరిస్థితుల్లో రైతులు చెరుకు పంట వెయ్యడం చాల కష్టంగా ఉందని, ఆలాంటి సమయంలో రైతులు వ్యర్థాలను కాల్చి బూడిద చేసి పంటకు వేస్తున్నారని, వారిని విమర్శించడంలో అర్థం లేదని ఉత్దరప్రదేశ్ మంత్రి, బీజేపీ నాయకుడు సునీల్ భరలా చెప్పారు.

లక్నోలో వాయు కాలుష్యం ఎక్కువ అయ్యిందని, రైతులు వ్యర్థాలకు నిప్పంటించడం వలనే కాలుష్యం ఎక్కువ అవుతోందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల చెప్పింది. ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ అయ్యింది. వాయు కాలుష్యానికి పరిష్కారం హోమాలు, యాగాలు చెయ్యాలని బీజేపీ నాయకుడు సునీల్ భరోలా వింత పరిష్కారం చెప్పడంతో బీజేపీ నాయకులు ముక్కున వేలుసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+