Viral Video : మెట్రోలో రెచ్చిపోయిన లవర్స్..పక్కనే ఉన్న ఆంటీ ఏం చేసిందంటే..?
ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. తమ చూట్టు ఎవరున్నారనేది కూడా వారు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువుగానే చూస్తున్నాం. ముఖ్యంగా మెట్రో రైల్లో ప్రేమికులు రొమాన్స్ చేయడం ఈ మధ్యకాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
రద్దీగా ఉన్న మెట్రోలో ప్రేమజంట రొమాన్స్‌తో రెచ్చిపోయారు. రైల్లో చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ .. వారికి పట్టించుకోకుండా తమ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మెట్రోలో ప్రయాణికులు ఉన్నారనే సంగతి మర్చిపోయి రొమాన్స్‌లో మునిగిపోయారు. ఇద్దరూ హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకున్నారు. తరువాత తాకరాని చోట తాకుతూ రెచ్చిపోయారు. ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది.

తొలుత దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని లవర్స్ చేస్తున్న చెండాలన్ని చూసిన ఓ ఆంటీ కోపంతో రగలిపోయింది. మీరు రొమాన్స్ చేసుకోవడానికి రైలే దొరికిందా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్లో వందలమంది ఉన్నా కూడా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అంటూ వారిని ప్రశ్నించింది. ఆంటీని కూడా అదే రీతిలో మమ్మల్ని అడగడానికి నువ్వెవరు అంటూ ఎదురు ప్రశ్నించాడు ప్రియుడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది.

గొడవ పెద్దది కావడంతో..పక్కనే ఉన్న ప్రయాణికులు కలుగజేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. అయితే ఈ తతంగాన్ని అంతా అక్కడ ఉన్న యువకులు వీడియో తీసుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రేమికులను ఆంటీ అంతరాయం కలిగించిందని కొందరు అంటుంటే..పబ్లిక్‌లో రొమాన్స్ చేస్తున్న లవర్స్‌కి ఆంటీ తగిన బుద్ది చెప్పిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications