అసెంబ్లీలో సెక్స్ వీడియో చూస్తే దేశద్రోహం కాదు, అమిత్ షా బుద్దిమంతుడు, బీజేపీ మంత్రి !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియో చూసి మంత్రి పదవికి రాజీనామా చేసి ఇప్పుడు మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న లక్ష్మణ సవదికి సాటి మంత్రి, బీజేపీ సీనియర్ నేత మధుస్వామి మద్దతుగా నిలిచారు. అసెంబ్లీలో సెక్స్ వీడియో చూడటం దేశద్రోహం కాదని మంత్రి మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోర్న్ వీడియో చూసిన వ్యక్తికి బీజేపీ హైకమాండ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఇచ్చింది అని మీడియా ప్రశ్నిస్తే ఆ విషయంపై అమిత్ షా చాల బుద్దిమంతుడు అని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసని కర్ణాటక మంత్రి మధుస్వామి అన్నారు.

దేశద్రోహం చెయ్యలేదు కదా !
అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చేశారని ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది మీద ఆరోపణలు ఉన్నాయి. లక్ష్మణ సవదికి మద్దతుగా బ్యాటింగ్ చేసిన మంత్రి మధుస్వామి ఆయన ఎవ్వరికీ కీడు తలపెట్టలేదని, ద్రోహం చెయ్యలేదని అన్నారు. అసెంబ్లీలో ఆకస్మికంగా లక్ష్మణ సవది ఓ సెక్స్ వీడియో చేశారని, దానికి ఇంత పెద్ద రాద్దాంతం చెయ్యడం ఏమిటని మంత్రి మధుస్వామి ప్రశ్నించారు.

క్షమించరాని నేరం కాదు !
ఆకస్మికంగా తప్పులు చెయ్యడం సహజం, అయితే దానిని ముందు పెట్టుకుని పదేపదే మాట్లాడటం, చర్చ పెట్టడం ఏమిటని మంత్రి మధుస్వామి ప్రశ్నించారు. సెక్స్ వీడియో చూశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది దేశద్రోహం చెయ్యలేదు కదా ? క్షమించరాని నేరం ఏమైనా చేశారా ? అని మంత్రి మధుస్వామి ప్రశ్నించారు.

కళ్లల్లో కారం చల్లుకుంటారా ?
మాజీ సీఎం సిద్దరామయ్య లక్ష్మణ సవది విషయంలో చాలసార్లు ఆరోపణలు చేసిన విషయంపై మంత్రి మధుస్వామి మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారని అన్నారు. సిద్దరామయ్య గురించి మాట్లాడితే చెప్పడానికి చాల ఉన్నాయని మంత్రి మధుస్వామి వ్యంగంగా అన్నారు. మన కళ్లల్లో మనమే కారం వేసుకుంటామా చెప్పండి, పోర్న్ వీడియో చూసిన వ్యక్తి మంత్రి కావడంతో ఇంత చర్చ జరుగుతోందని మంత్రి మధుస్వామి అన్నారు.

సెక్స్ వీడియో చూడటం తప్పేం కాదు !
లక్ష్మణ సవది సెక్స్ వీడియో చూడటం తప్పేమి కాదని తన వ్యక్తిగత అభిప్రాయమని, అది ఆకస్మికంగా జరిగిందని, దీనిని పెంచుకుంటూ పోవడం, చర్చలు పెట్టడంలో ఎలాంటి అర్థం లేదని మంత్రి మధుస్వామి అన్నారు. అయితే అసెంబ్లీలో అలాంటి వీడియోలు చూడటం తప్పు అని మంత్రి మధుస్వామి అనడం విశేషం.

అమిత్ షా మాకంటే బుద్దిమంతుడు
కేంద్ర మంత్రి అమిత్ షా మాకంటే ఎక్కువ బుద్దిమంతుడు అని మంత్రి మధుస్వామి అన్నారు. బీజేపీలో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనే విషయం బాగా తెలిసిన వ్యక్తి అమిత్ షా అని మంత్రి మధుస్వామి చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ హవా లేని చోట్ల లక్ష్మణ సవది కష్టపడి పని చేసి అక్కడి అభ్యర్థులను గెలిపించారని మంత్రి మధుస్వామి అన్నారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు లక్ష్మణ సవది అవసరం చాలా ఉందని, అందుకే ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని మంత్రి మధుస్వామి వివరణ ఇచ్చారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications