Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హిందువులను ఎండబెట్టి ముస్లింలకు మంచి నీళ్లు

Delhi water cricis: దేశ రాజధానిలో నీటి సంక్షోభానికి తెరపడట్లేదు. రోజులు గడుస్తున్నా ట్యాంకర్లే గతి అయ్యాయి. గొంతు తడుపు కోవడానికి చుక్క నీటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. పాని పట్టు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్ రాగానే ఢిల్లీవాసులు బిందెలు, బకెట్లు, పైపులతో దాని మీదికి ఎగబడటం సర్వసాధారణం అయిందక్కడ.ఢిల్లీ జనాభా 3 కోట్ల 20 లక్షలు పైమాటే. ఢిల్లీ మంచినీటి అవసరాలు రోజూ మూడున్నర మిలియన్ లీటర్లు అవసరమౌతాయి. ఢిల్లీకి ప్రధాన నీటి వనరులు అక్కడి నదులే. గంగానది- 470, యమున- 755, భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ నుంచి 495 క్యూసెక్కుల మేర నీటీని తరలిస్తారు.

గత ఏడాది నెలకొన్న వర్షభావ పరిస్థితుల ఈ మూడు నదుల్లో డెడ్ స్టోరేజీ ఏర్పడింది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా నీళ్లు అందట్లేదు. ఈ ఏడాది వేసవి ఆరంభం నుంచే నీటి ఎద్దడి నెలకొంది. దీన్ని అధిగమించడానికి ఢిల్లీ జల్ బోర్డు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. నీటి కొరత నెలకొంది. మంచినీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.ఈ సమస్య కాస్తా రాజకీయ రంగు పులుముకొంది. రెండు దఫాలుగా భారీ మెజారిటీతో ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ముందు చూపు లేదంటూ అటు కాంగ్రెస్, ఇటు భారతీయ జనతా పార్టీ దుమ్మెత్తి పోస్తోన్నాయి. రోడ్ల మీదికి వచ్చాయి. మట్కా ఫోడ్.. ఆందోళనలను చేపట్టాయి. ఖాళీ కుండలతో ఢిల్లీ జల్ బోర్డ్ కార్యాలయంపై రోజూ దాడులు సాగిస్తోన్నాయి.

Water from Hindu areas is being stopped and supplied to Muslims says Kapil Mishra

ఈ పరిస్థితుల మధ్య బీజేపీ మరో అడుగు ముందుకేసింది. మతాన్ని తీసుకొచ్చింది. హిందు, ముస్లిం అంటూ నీటి ఎద్దడి బాధితులను విడగొట్టింది. ఉన్న అరకొర నీటిని సరఫరా చేయడం, ట్యాంకర్లను తరలించడంలో హిందువులపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ బీజేపీ ఆరోపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.హిందువులు నివసించే ప్రాంతాలకు మంచినీటిని నిలిపివేసి ముస్లింలు ఉండే ప్రదేశాలకు ఢిల్లీ ప్రభుత్వం తరలిస్తోందంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా ఆరోపించారు. హిందువులు అధికంగా నివసించే యమునా విహార్, మౌజ్‌పూర్, గోకుల్‌పురిల నుంచి మంచినీటిని ముస్లింల ప్రాబల్యం ఉండే సీలంపూర్, జఫ్రాబాద్, సీమాపురీలకు పంపిస్తోందంటూ ఆయన ఆరోపించారు.

ఐపీ ఎక్స్‌టెన్షన్ నుంచి నీటిని అల్లా కాలనీకి తరలిస్తోందంటూ విమర్శించారు. రాజేంద్రనగర్, కరోల్ బాగ్, ఆనంద్ పర్వత్ ప్రాంతాలకు దక్కాల్సిన మంచినీటిని జామా మసీద్, మతియా మహల్ వంటి ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తీసుకెళ్తోన్నారంటూ ధ్వజమెత్తారు కపిల్ మిశ్రా. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+