ఆర్ కే నగర్ ఓటర్లకు సినిమా చూపిస్తున్న టీటీవీ దినకరన్: అడుగుపెడితే అంతే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయ్యి జరిగిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్ అప్పుడు స్థానిక ప్రజలకు కనపడకుండా తిరుగుతూ వారికి సినిమా చూపిస్తున్నాడు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీటీవీ దినకరన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో అడుగుపెట్టాలంటే హడలిపోతున్నారని తెలిసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కు మద్దతుగా ప్రచారం చేసిన స్థానిక నేతలు ఇప్పటికే మాయం అయ్యారు.

Way TTV Dinakaran yet meet RK Nagar voters in Chennai

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పోలీంగ్ రోజు రూ. 20 నోట్ల మీద రహస్యంగా కొన్ని గుర్తులు పెట్టి స్థానిక ఓటర్లకు పంపిణి చేసి ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని తరువాత రూ. 20 నోటు వెనక్కి తీసుకుని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలు ఇస్తామని ఆయన అనుచరులు హామీ ఇచ్చారు.

పోలింగ్ పూర్తి అయిన తరువాత టీటీవీ దినకరన్ అనుచరులు కొందరు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవాలని ప్రయత్నించడంతో ఓటర్లు నిలదీశారు. టీటీవీ దినకరన్ అనుచరులను పట్టుకుని చితకబాదేశారు. ఈ దెబ్బతో ఆర్ కే నగర్ లో అడుగుపెడితే ఓటర్లు నిలదీస్తారనే భయంతో టీటీవీ దినకరన్ అటు వైపు కన్నెత్తి చూడటం లేదని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran, independent candidate from RK Nagar, not visit his constituency so far. Interesting information about why he didn't met voters.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి