అమిత్ షాను కలిసిన ప్రియాంక గాంధీ: ఎందుకంటే?
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేతృత్వంలోని కేరళ ఎంపీ బృందం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా వయనాడ్ కొండచరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు వినతి పత్రాన్ని అందించారు.
కేంద్రమంత్రితో సమావేశం అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. వయనాడ్ విలయం కారణంగా అనేకమంద్రి ప్రజలు సర్వస్వం కోల్పోయారని, వారిని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ఎంపీ తెలిపారు. నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి సాయం అందలేదన్నారు.

కాగా, జులై 30న వయనాడ్‌లో భారీ ప్రకృతి విలయం సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతోపొటు కొండచరియలు విరిగిపడి 231 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నివాసాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రాయులయ్యారు.
As part of a delegation of MP’s from Kerala, I met Union Home Minister Shri Amit Shah today. We carried a petition for immediate relief to be provided to the people of Wayanad who are still struggling to overcome the devastating tragedy that occurred four months ago.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 4, 2024
We… pic.twitter.com/JH3WB2xMqg
పుంఛిరిమట్టం, చూరల్‌మల ముండక్కై మూడు గ్రామాల్లో భారీ మొత్తంలో నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ ఇంతవరకు పెద్దగా సాయం అందలేదని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, సహాయక చర్యలపై గురువారం సాయంత్రంలోగా అప్‌డేట్ చేస్తామని అమిత్ షా హామి ఇచ్చారు.
ఇది ఇలావుండగా, ఇటీవల వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ స్థానికి జరిగిన ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ.. సోదరుడికి కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. దాదాపు 4 లక్షల ఓట్ల మెజార్టీతో ప్రియాంక ఘన విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు.












Click it and Unblock the Notifications