• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేను 100 శాతం నెగ్గుతా: యడ్యూరప్ప, అప్పటికే బీజేపీ భవితవ్యం తేలిపోనుంది

By Srinivas
|
  కర్ణాటక బల పరీక్ష...యడ్యూరప్ప నేగ్గేనా???

  బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. బలపరీక్షలో కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. రేపు బలపరీక్షకు తాము సిద్ధమని చెప్పారు. చీఫ్ సెక్రటరీతో మాట్లాడి అసెంబ్లీ సమావేశాలపై మాట్లాడుతామని చెప్పారు. బలపరీక్షలో నెగ్గుతానని తనకు వంద శాతం నమ్మకం ఉందని చెప్పారు.

  బీజేపీ ఎంపీ శోభ కందర్లాజే మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రేపు జరగనున్న ఫ్లోర్ టెస్టులో మా బలం నిరూపించుకుంటామన్నారు.

  బెదిరింపులు వచ్చాయి, అందుకే తరలించాం

  అంతకుముందు, ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించడంపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. బెంగళూరు రిసార్టులో ఉన్న తమ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వచ్చాయని, దీంతో వారిని కేరళ తరలించాలని భావించామని, కానీ ఎయిర్ బస్‌కు అనుమతి దొరకలేదని, దీంతో రోడ్డు మార్గంలో మరోచోటకు తరలించాల్సి వచ్చిందని చెప్పారు.

  యడ్యూరప్ప నిరూపణపై సర్వత్రా ఆసక్తి

  కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసెంబ్లీలో బలాన్ని ఎలా నిరూపించుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తదుపరి పరిణామాల్లో కొత్త స్పీకర్‌ పాత్ర కీలకమవుతుంది. బలపరీక్ష సందర్భంగా స్పీకర్‌ తీసుకునే కీలక నిర్ణయాలపై యడ్యూరప్ప భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కర్ణాటక శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యే దేశ్‌పాండేను అసెంబ్లీ సచివాలయం సిఫార్సు చేసింది. ఆయన ఎనిమిదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యే వ్యక్తిచే గవర్నర్‌ తొలుత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ప్రొటెం స్పీకర్‌గా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌ తాత్కాలికంగా శాసనసభ వ్యవహారాలను నిర్వహిస్తారు.

  ప్రొటెం స్పీకర్.. అలా అధికారాలు ఉండవు కానీ

  ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే సభా కార్యక్రమాల్లో, బలపరీక్షలో పాల్గొనే అధికారం శాసన సభ్యులకు వస్తుంది. ప్రొటెం స్పీకర్‌కు శాశ్వత స్పీకర్‌లాగా అధికారాలు ఉండవు. బలపరీక్ష నిర్వహణ ప్రక్రియ ఆయన విధి కాదు. కానీ స్పీకర్‌ను ఎన్నుకోలేని సమయంలో ఆ విధులు నిర్వర్తిస్తారు.

  అక్కడే యడ్యూరప్ప విషయం తేలిపోతుంది

  ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సభ ఆరంభంలోనే ఫ్లోర్ టెస్టును ఎదుర్కోవాల్సి వస్తే విశ్వాస పరీక్షను సైతం ప్రొటెం స్పీకర్‌ నిర్వహించిన సందర్భాలున్నాయి. సభ్యుల ప్రమాణం అనంతరం సభానాయకుడు స్పీకర్‌ ఎన్నికను కోరే అవకాశముంది. ఇదే జరిగితే స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ ఉంటే సభలో సభ్యుల అభిప్రాయం తెలుసుకుని సభాపతి ఫలితాన్ని ప్రకటిస్తారు. సభానాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అభ్యర్థి స్పీకర్‌ ఎన్నికల్లో ఓడిపోతే అది విశ్వాసపరీక్ష లాంటిదే కాబట్టి ప్రభుత్వానికి శాసనసభ్యుల మద్దతు లేదని అక్కడే తేలిపోతుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Will discuss with Chief secretary and call for assembly session tomorrow. We are 100% confident that we will prove full majority: Karnataka CM BS Yeddyurappa on Supreme Court's order for floor test.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more