వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడుకుతున్న ఢిల్లీ: నల్లకోటు వేసుకున్న గుండాలుగా ప్రవర్తిస్తారా?రోడ్డెక్కిన వందలాది మంది పోలీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వందలాది మంది పోలీసులు రోడ్డెక్కారు. తమపై న్యాయవాదుల భౌతిక దాడులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. మూడురోజులుగా వరుసగా కొనసాగుతున్న న్యాయవాదుల దాడులను నిరసిస్తూ మహా ప్రదర్శన నిర్వహించారు. పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయం ఎదురుగా బైఠాయించారు. నినాదాలతో హోరెత్తించారు. దేశ రాజధానిలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వందలాది మంది పోలీసులు తమ విధులను బహిష్కరించి, డీజీపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తీస్ హజారీ దాడులు కొనసాగింపు..

న్యూఢిల్లీలోని తీస్ హజారి న్యాయస్థానం ఆవరణలో శనివారం పోలీసు అధికారులు, న్యాయవాదులు బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే. ఓ కేసు విషయంలో ఏర్పడిన విభేదాల కారణంగా వారి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. న్యాయవాదులు, పోలీసులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలను తగుల బెట్టుకున్నారు. భౌతిక దాడులకు దిగారు. ఈ ఘటన చోటు చేసుకున్న తరువాత దీని ప్రకంపనలు మరింత పెరిగాయి. ఆది, సోమవారాల్లో పలు చోట్ల విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లపై న్యాయవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

ఒంటరిగా దొరికితే.. దాడులు

న్యూఢిల్లీలోని సాకేత్ జిల్లా న్యాయస్థానం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను కొందరు న్యాయవాదులు చుట్టుముట్టి కొట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఘటనపై పోలీసు అధికారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో సైతం కొందరు న్యాయవాదులు పోలీసులను తరిమి తరిమి కొట్టారు. ఈ రెండు ఘటనల పట్ల పోలీసు అధికారులు భగ్గుమంటున్నారు. తీస్ హజారీ న్యాయస్థానం ఆవరణలో సంభవించిన పరస్పర దాడులపై ఏకంగా ఢిల్లీ హైకోర్టే జోక్యం చేసుకుంది. బార్ అసోసియేషన్లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు నోటీసులను జారీ చేసింది. అయిప్పటికీ.. న్యాయవాదులు భౌతిక దాడులకు దిగుతున్నారని పోలీసు అధికారులు ఆరోపిస్తున్నారు.

పంచింగ్ బ్యాగులనుకున్నారా?

న్యాయవాదుల దాడుల పట్ల దేశవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులు, పలు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదుల కంటికి తాము ఎలా కనిపిస్తున్నామని మండిపడుతున్నారు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించే పంచింగ్ బ్యాగులగా కనిపిస్తున్నామా అంటూ నిలదీస్తున్నారు. పోలీసులకు కుటుంబాలు ఉండవా? వారిలో మానవత్వం ఉండదా? పోలీసులు మనుషులు కారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసుల జోలికి వచ్చేటప్పటికి మానవ హక్కుల గురించి ఎవరూ మాట్లాడట్లేదు ఎందుకంటూ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

చట్టానికి ఎవరూ అతీతులు కారు..

చట్టానికి ఎవరూ అతీతులు కారని ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. న్యాయవాదులైనంత మాత్రాన చట్టాన్ని ఉల్లంఘించే హక్కు, అధికారం వారికి ఉందా? అని నిలదీస్తున్నారు. న్యాయవాదులు న్యాయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. నల్లకోటు వేసుకున్న గుండాలుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే..పోలీసులపై భౌతిక దాడులకు పాల్పడిన న్యాయవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయాన్ని పరిరక్షించాల్సిన లాయర్లు తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
The brawl between police officers and lawyers at Delhi's Tis Hazari Court on Saturday has now escalated into a full-blown row. On Tuesday, a large group of police personnel gathered outside the Delhi Police headquarters at ITO to protest the Saturday violence and the assault on police officers by lawyers subsequently. The police personnel, in uniform, were seen wearing black bands to condemn the attacks on their ranks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X