ఓ గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయాం.. మన్మోహన్‌కు సోనియా గాంధీ నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివేకానికి, వినయానికి ప్రతిరూపమైన ఓ గొప్ప నాయకుడిని, మార్గనిర్దేశకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని సోనియా గాంధీ అన్నారు. మన్మోహన్ దూరదృష్టితో దేశంలోని లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు విరిశాయని అన్నారు.
ఆయన లేని లోటు పార్టీకి, దేశానికి పూడ్చలేనిదాని, వ్యక్తిగతంగా తాను ఓ స్నేహితుడిని, తత్వవేత్తను, మార్గదర్శకుడిని కోల్పోయానని సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందారని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగానే సౌమ్యుడే అయినప్పటికీ.. విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో దృఢ నిశ్చయంతో ఉండేవారని ఆమె అన్నారు.

మన్మోహన్ సింగ్ చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని సోనియా గాంధీ ప్రశంసించారు. మరోవైపు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలిపింది. ఆయన ఆశయాలను, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని తీర్మానం చేసింది. మన్మోహన్ నిజమైన రాజనీతిజ్ఞుడని, దేశం కోసమే జీవితాన్ని ధారపోశారని సీడబ్ల్యూసీ పేర్కొంది.
గొప్ప నాయకుడిగా, ఆర్థికవేత్తగా, నిరాడంబరమైన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ జీవితం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుందని, ఆయన వారసత్వం ఎప్పటికీ జీవించే ఉంటుందని.. దేశాభివృద్ధి కోసం అందర్నీ ప్రేరేపిస్తుందని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
In Dr #ManmohanSingh's passing, we have lost a leader who was the epitome of wisdom, nobility and humility, who served our country with all his heart and mind. A luminous and beloved guiding light for the Congress party, his compassion and vision transformed and empowered the… pic.twitter.com/jsJI4SyYJX
— ANI (@ANI) December 27, 2024
ఇది ఇలావుండగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్లు వెల్లడించింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications