'రిసార్టులో ఏంజరిగిందో ఆధారాలు': శశికళకు షాక్, పళని ప్రభుత్వం నిలబడేనా?

గోల్డెన్ బే రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పదకొండు రోజుల పాటు నిర్బంధించినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని చెన్నై న్యాయవాది బాలు పేర్కొన్నారు. తమను నిర్బంధించినట్టు చాలామంది ఫిర్యాదు కూడా చేశారన్నారు

చెన్నై: గోల్డెన్ బే రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పదకొండు రోజుల పాటు నిర్బంధించినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని చెన్నై న్యాయవాది బాలు పేర్కొన్నారు. తమను నిర్బంధించినట్టు చాలామంది ఫిర్యాదు కూడా చేశారన్నారు.

త్వరలోనే వాటిని కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్ సెల్వం పోటీపడడంతో పార్టీ అధినేత్రి శశికళ ఎమ్మెల్యేలను చెన్నైలోని గోల్డెన్ బే రెస్టారెంటుకు తరలించిన విషయం తెలిసిందే.

కువత్తూర్‌లోని గోల్డెన్ బే రిసార్టులో 120 మందికి పైగా పైగా ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారనీ, తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బాలు సహా మరో న్యాయవాది మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాము ఎమ్మెల్యేలను బలవంతంగా బంధించలేదని శశికళ చెప్పారు. లాయర్ బాలు మాత్రం ఆధారాలున్నాయని చెప్పి అన్నాడీఎంకేకు షాకిచ్చారు.

పళని నెగ్గినా..

పళని నెగ్గినా..

కాగా, అయిదు రోజుల క్రితం ముఖ్యమంత్రి పళనిస్వామి బల నిరూపణ పరీక్షలో నెగ్గడంతో ఓ కొలిక్కి వచ్చింది. ప్రజాస్వామ్యబద్దం కానీ, కాకపోనీ పళని స్వామి మాత్రం 122 ఓట్లతో బల పరీక్ష నెగ్గారు.

బలపరీక్ష ఇలా..

బలపరీక్ష ఇలా..

పన్నీర్‌కు మద్దతిస్తున్న 11 మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి బయటికొచ్చేశారు. డీఎంకే సభ్యులు తమకు అవమానం జరిగిందంటూ గవర్నర్‌‌కు ఫిర్యాదు చేశారు.

నెగ్గింది కానీ..

నెగ్గింది కానీ..

పళని స్వామి ప్రభుత్వమైతే ఎమ్మెల్యేల మద్దతుతో బల పరీక్షను నెగ్గింది. కానీ ప్రభుత్వ స్థిరత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పళని ప్రభుత్వం నిలబడుతుందా లేదా అన్నది సందేహమేనని అంటున్నారు.

ప్రజాస్వామ్యయుతంగా లేదని..

ప్రజాస్వామ్యయుతంగా లేదని..

ముఖ్యమంత్రి ఎన్నిక స్పీకర్ లెక్క ప్రకారం చెల్లినా, ప్రజాస్వామ్యయుతంగా చూస్తే ఆ ఎన్నిక ఎంత మాత్రం చెల్లదని చాలామంది భావిస్తున్నారు. 234 మంది ఉన్న అసెంబ్లీలో 122 మంది ఎమ్మెల్యేలు పళనికి మద్దతు తెలిపారు.

ఫిర్యాదులు

ఫిర్యాదులు

అయితే విశ్వాస తీర్మానానికి సంబంధించి జరిగే ఓటింగ్ ప్రక్రియలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు. అది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే అంటున్నారు. ఇప్పటికే దీని పైన చర్చ జరుగుతోంది. విపక్షాలు ఫిర్యాదు కూడా చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+