షాహీన్‌బాగ్‌ను శాంతి బాగ్ చేస్తాం.. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత వ్యాఖ్యలు

దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా దాదాపు నెలరోజులుగా అక్కడి మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడిదే ప్రధాన అంశంగా మారిపోయింది. షాహీన్‌బాగ్ అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ గురిపెడుతోంది. ఈ నేపథ్యంలో షాహీన్‌బాగ్‌పై ఆ పార్టీ నేతలు పర్వేష్ వర్మ,అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ షాహీన్‌బాగ్‌పై స్పందించారు.

ఫిబ్రవరి 8న ఢిల్లీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఢిల్లీ మొత్తాన్ని నిరసన ప్రాంతంగా మార్చాలని చూస్తున్నవారికి.. షాహీన్‌బాగ్‌ను శాంతి బాగ్‌గా మార్చాలని చూస్తున్నవారికి మధ్య జరగబోతున్నాయని అన్నారు. 'ఓవైపు పాకిస్తాన్ భాషను మాట్లాడే ప్రజలు,మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్‌ గర్వపడేలా చేసినవారు..' అంటూ షాహీన్‌బాగ్,ప్రధాని మోదీలను ఉద్దేశించి మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. ఓవైపు ఢిల్లీ మొత్తాన్ని షాహీన్‌బాగ్ చేయాలనుకునేవారు.. మరోవైపు షాహీన్‌బాగ్‌ను శాంతి బాగ్‌ చేయాలనుకునేవారు ఉన్నారని.. ఓటర్లు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలని అన్నారు.

we want to make shaheen bagh as Shanti Bagh says bjp chief manoj tiwari

ఇదే ర్యాలీలో మనోజ్ తివారీ ప్రసంగానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. షాహీన్‌బాగ్ నిరసనలను ఆయన అరాచకం అని విమర్శించారు. రాజ్యాంగం వెనకాల,జాతీయ జెండా వెనకాల దాక్కుని తమకు లెక్చర్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. షాహీన్‌బాగ్,సీలంపూర్,జామియా.. ఇలా ఇన్ని ప్రదేశాల్లో సీఏఏ వ్యతిరేక నిరసనలు జరగడం యాధృచ్చికమేమీ కాదని.. దీని వెనకాల కుట్ర దాగుందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు మరిన్ని పెరిగితే.. రేప్పొద్దున షాహీన్‌బాగ్ లాగే మరో రోడ్డు కూడా బ్లాక్ అవుతుందన్నారు. ఢిల్లీని అలాంటి అరాచకవాదానికి వదిలిపెట్టలేమని.. కాబట్టి బీజేపీకి ఓటేయడం ద్వారా అలాంటి చర్యలకు చెక్ చెప్పాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+