రెండాకుల గుర్తుతోనే పోటీ, శశికళ కోరితే పదవిని వదులుకొనేవాడిని, పన్నీర్ సంచలనం

స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే తాము పోటీ చేస్తామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.

చెన్నై:స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే తాము పోటీ చేస్తామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.ఈ మేరకు ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలను ఆయన వివరించారు.

తమిళనాడు రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండు ఆకుల గుర్తుపైనే తాము పోటీ చేస్తామని పన్నీర్ సెల్వం ప్రకటించారు.

అన్నాడిఎంకె పార్టీ చీలిక వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వైపు కొందరు నాయకులు , ఎంఏల్ఏలు , ఎంపిలు వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని పన్నీర్ సెల్వం వర్గం సవాల్ చేసింది.

అయితే అన్నాడిఎంకె పార్టీ నుండి జయలలిత ఎవరిని బయటకు పంపారో వారే ప్రస్తుతం పార్టీని నడుపుతున్నారని, ఓక కుటుంబం చేతిలోనే పార్టీ, ప్రభుత్వం ఉన్నాయని పన్నీర్ సెల్వం ఆరోపిస్తున్నారు.

రెండాకుల గుర్తుపైనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ

రెండాకుల గుర్తుపైనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ

తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో తాము రెండాకుల గుర్తుపై పోటీచేసే అవకాశం ఉందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.జయలలిత మేనకోడలు కూడ కొత్త పార్టీని శుక్రవారం నాడు ప్రారంభించారు.అయితే దీప జయకుమార్ ప్రారంభించిన పార్టీతో కలిసి తాము పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని పన్నీర్ సెల్వం ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పన్నీర్ సెల్వం ప్లాన్

రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పన్నీర్ సెల్వం ప్లాన్

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ బాద్యతలు చేపట్టిన తర్వాత పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.ఈ మేరకు పన్నీర్ సెల్వానికి మద్దతుగా కొందరుసీనియర్లు శశికళకు వ్యతిరేకంగా తమ గళాన్ని విన్పించారు.అయితే ముఖ్యమంత్రి పీఠం పన్ట్టేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు.ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు పన్నీర్ ప్లాన్ చేస్తున్నాడు.

వద్దని చెప్పినా సిఎం పదవి ఇచ్చారు

వద్దని చెప్పినా సిఎం పదవి ఇచ్చారు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పినా తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని ఆయన చెప్పారు. తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో తనంతట తానుగానే ముఖ్యమంత్రి పదవిని వదులుకొనే పరిస్థితిని కల్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల్లో తేటతెల్లం కానుందని ఆయన ప్రకటించారు.

శశికళ నాతో మాట్లాడితే ముఖ్యమంత్రి పదవిని వదులుకొనేవాడిని

శశికళ నాతో మాట్లాడితే ముఖ్యమంత్రి పదవిని వదులుకొనేవాడిని

తనను పిలిచి శశికళ మాట్లాడి ఉంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకొనేవాడినని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు. మంత్రి ఉదయ్ కుమార్ ద్వారా ముఖ్యమంత్రి పదవి విషయమై శశికళ వివాదాన్ని రేపారని ఆయన చెప్పారు.మరోకరు ముఖ్యమంత్రిగా వస్తారని తెలిస్తే అధికారులు తన మాట వింటారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలోనూ, కుటుంబంలోకూ కుటుంబం ఆధిపత్యం ఉండకూడదని జయలలిత భావించేవారని ఆయన గుర్తుచేసుకొన్నారు.అందుకే ముఖ్యమంత్రి పదవిని శశికళ చేపట్టాలని భావించినప్పుడు తాను వ్యతిరేకించినట్టుగా ఆయన చెప్పారు.

జయలలితకు ద్రోహం చేయను

జయలలితకు ద్రోహం చేయను

ఇతర పార్టీలతో కలిసి జయలలితకు ద్రోహం చేయడం తనకు అలవాటు లేదని, భవిష్యత్ లో కూడ ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నం కాబోదని ఆయన చెప్పారు. డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను చూసి నవ్వానని వచ్చిన వార్తలపై ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. అన్నా డి ఎంకె నుండి తాము చీలిపోలేదని ఆయన చెప్పారు. ప్రజా ఉద్యమంగా కలిసి కట్టుగా పనిచేసేందుకుగాను సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.

కమల్ హసన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

కమల్ హసన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

తన పట్ల తమిళ సినీ నటుడు కమల్ హసన్ చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా పన్నీర్ సెల్వం చెప్పారు.అంతేకాదు దీపా జయకుమార్ సోదరుడు దీపక్ తాజా వ్యాఖ్యలు ప్రజల భావాలను ప్రస్పుటించేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీప జయకుమార్ ఏర్పాటు చేసిన కొత్త పార్టీతో కలిసి పోటీచేస్తామని ఆయన ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+