టిపై విభేదాలు నిజమే, అవిశ్వాసం ఎదుర్కొంటాం: చాకో
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీలో విభేదాలు వాస్తవమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో మంగళవారం చెప్పారు. తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు కేవలం తెలంగాణ అంశంపై మాత్రమే విభేదిస్తున్నారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం అనూహ్యమైనప్పటికీ తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు.
సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడిస్తామన్నారు.

కాగా, తమ పార్టీ లోకసభ సభ్యులు తమ యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడం అనూహ్య పరిణామమేనని, అయితే దాన్ని అధిగమిస్తామని పిసి చాకో సోమవారం కూడా చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణపై అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ తమ పార్టీ బాహాటంగానే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సరైన సమయంలో మాట్లాడకుండా తమ పార్టీ లోకసభ సభ్యులు ఇలా చేయడం సరికాదని అన్నారు.
అవిశ్వాసం ఊహించని పరిణామమే అయినా సమర్ధంగా అధిగమిస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చిస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెసుకు చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నలుగురు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ముగ్గురు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. నోటీసు ఇవ్వడానికి సంఖ్యాబలం అవసరం లేకున్నప్పటికీ అవిశ్వాసం చర్చకు రావాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.












Click it and Unblock the Notifications