జయలలితకు చికిత్స: వీడియో, ఫోటోలు ఉన్నాయి, విచారణ కమిటీకి ఇస్తాం: మన్నార్ గుడి !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేసిన సమయంలో వీడియో, ఫోటోలు తీశామని, విచారణ కమిటీకి ఆ సాక్షాలు అందిస్తామని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ అన్నారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేసిన సమయంలో వీడియో, ఫోటోలు తీశామని, విచారణ కమిటీకి ఆ సాక్షాలు అందిస్తామని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ అన్నారు. జయలలిత చికిత్స విషయంలో మంత్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీటీవీ దినకరన్ మండిపడ్డాడు.

సోమవారం టీటీవీ దినకరన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స చేసే సమయంలో ఆసుపత్రి యూనీఫాం (గౌను) వేసుకున్నారని, ఆమెకు చికిత్స చేస్తున్న సందర్బంలో వీడియో, ఫోటోలు తీశామని టీటీవీ దినకరన్ చెప్పారు.

 We will dubmit Jayalalithaa’s videos, pics during probe: TTV Dinakaran

కొందరు మంత్రులు తమ పదవులు కాపాడుకోవడానికి, ప్రజలను అయోమయానికి గురిచెయ్యడానికి జయలలిత చికిత్స విషయంలో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీటీవీ దినకరన్ ఆరోపించారు. మంత్రి దిండుగల్ శ్రీవాసన్ కు పిచ్చిపట్టి పాడుకూతలు కూస్తున్నారని టీటీవీ దినకరన్ మండిపడ్డారు.

జయలలిత మరణంపై అనుమానాలు ఉంటే ఎందుకు విచారణ కమిటీ వెయ్యడానికి ఆలస్యం చేస్తున్నారని టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ప్రశ్నించాడు. డ్రామాలు వెయ్యడంలో పన్నీర్ సెల్వం దిట్ట అని, అతనికి మించిన మరో నటుడు ఎవ్వరూ లేరని టీటీవీ దినకరన్ ఎద్దేవ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+